వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరీ విజయ గద్దె : నాడు ట్రంప్ - నేడు ఎలన్ మస్క్ తో ఢీ : సాహసోపేత నిర్ణయాలతో..!!

|
Google Oneindia TeluguNews

విజయ గద్దె. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచిన పేరు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన ట్విట్టర్ ను ఎలన్ మస్క్ చేతికి వెళ్లిన వెంటనే ..విజయ గద్దె పేరు ప్రచారంలోకి వచ్చింది. ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను సొంతం చేసుకోగానే విజయ గద్దెనే టార్గెట్ చేసుకుంటూ, ఆమె నిర్ణయాలను తప్పుబడుతూ ట్వీట్స్ పెట్టడం ట్విట్టర్ భవిష్యత్‌లో ఎలా ఉండబోతోందో స్పష్టం అవుతుందని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు.

తెలుగు బిడ్డ..విజయ గద్దె

తెలుగు బిడ్డ..విజయ గద్దె


ఈ గద్దె విజయ తెలుగు మహిళే. విజయ గద్దె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జన్మించారు. ఈమెకు మూడేళ్లు వున్నప్పుడు అమెరికా కి వెళ్లి పోయారు. టెక్సాస్ లో చదువుకున్నారు. న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా లో న్యాయశాస్త్రం పూర్తి చేసారు. విజయ తల్లిదండ్రులు అక్కడే స్థిర పడ్డారు. విజయ లా చదివారు. రామ్సే హామ్సనీని ఈమె పెళ్లి చేసుకున్నారు. అతను కూడా లాయర్. ఒక ప్రముఖ వార్తా సంస్థ ట్విట్టర్ అకౌంట్‌ను ఒక వాస్తవ కథనాన్ని బహిర్గతం చేసినందుకు తొలగించారని, ఈ నిర్ణయం అస్సలు ఏమాత్రం సరికాదని మస్క్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్‌ చేశారు. ట్విట్టర్‌ను సొంతం చేసుకున్నారో లేదో వెంటనే గత నిర్ణయాలను తప్పుబడుతూ మస్క్ ట్వీట్ పెట్టడం తో పెద్ద దుమారమే చెల రేగింది.

తొలి నుంచి సాహసోపేత నిర్ణయాలతో

తొలి నుంచి సాహసోపేత నిర్ణయాలతో

అయితే, ట్విట్టర్ లీడల్ హెడ్ స్థానంలో ఉన్న విజయ గద్దె మాత్రం నో కాంప్రమైజ్ అని తేల్చి చెప్పారు. వాస్తవంగా చూస్తే.. ట్విటర్ సీఈఓ కంటే లీగల్ హెడ్ పదవి చాలా ముఖ్యమైనది. లీగల్ హెడ్ అన్ని బాధ్యతలు తీసుకుంటారు. ట్విట్టర్ యూజర్స్ వాడే పదాలు అభ్యంతరకరంగా లేకుండా చూడాలి. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ ని తొలగించేందుకు ఈమె ముఖ్యమైన పాత్ర పోషించారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ చేజిక్కించుకున్న సమయంలో ట్విట్టర్‌లో నెటిజన్ల స్వేచ్ఛకు, వారి అభిప్రాయాల వ్యక్తీకరణకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందనే ఆందోళన కనిపించింది.

నాడు ట్రంప్ - నేడు ఎలాన్ మస్క్

నాడు ట్రంప్ - నేడు ఎలాన్ మస్క్

ట్విట్టర్‌ను ఎలన్ మస్క్ టేకోవర్ చేసుకున్న విషయం తెలిశాక ఉద్యోగులతో జరిగిన సమావేశంలో విజయ గద్దె భావోద్వేగానికి కూడా లోనయినట్లు తెలిసింది. ట్విట్టర్ భవిష్యత్‌పై ఈ తెలుగు మహిళ ఆందోళన వ్యక్తం చేసి కన్నీళ్లు పెట్టుకున్నట్లు ప్రచురిత మైన ఒక కధనం సంచలనంగా మారింది. ఎలన్ మస్క్ ఆ వార్తా సంస్థ విషయంలో విజయ గద్దెను విమర్శించడాన్ని కొందరు నెటిజన్లు కూడా సమర్ధించారు. అదే సమయంలో ట్విట్టర్ వేదికగా విజయ గద్దెను దూషిస్తూ పోస్ట్‌లు పెడుతున్న తీరు భవిష్యత్‌లో ట్విట్టర్ ఎలాంటి ట్వీట్స్‌కు వేదిక కాబోతోందనే విషయాన్ని సూచిస్తోందని ఈ పరిణామాలను నిశితంగా గమనించిన వారు అభిప్రాయపడుతున్నారు.

సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ

సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ

ఎలన్ మస్క్ అంతటితో ఆగలేదు. విజయ గద్దెను తన పోస్ట్ ద్వారా 'Curry' అని పోల్చడంలోనే ఎలన్ మస్క్ ధోరణికి వ్యతిరేకంగా విజయ గద్దెకు మద్దతుగా పెద్ద ఎత్తున పోస్టింగులు కనిపించాయి. విజయ గద్దె ని తప్పిస్తే ట్విట్టర్ లో భారీ షేర్లు ఉన్న ఈమెకు సంస్థ నుంచి భారీ మొత్తంలో ప్యాకేజీ చెల్లించాల్సి ఉంటుంది. దాదాపుగా 12.5 మిలియన్ డాలర్లు దక్కుతాయని బిజినెస్ పత్రికలు అంచనా వేస్తున్నాయి.

English summary
Musk's criticism of Twitter sparked a barrage of abusive tweets against the company's top lawyer. Gadde became the subject of a wave of personal attacks by Twitter users.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X