తిరుమల వేదికగా సాయిరెడ్డి కీలక ప్రకటన - టార్గెట్ ఫిక్స్..!!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొంత కాలంగా వైసీపీ మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి రాజకీయ భవిష్యత్ పైన కొత్త చర్చ జరుగుతోంది. కొత్త పార్టీ ఏర్పాటు పైనా.. పార్టీ పేరు పైనా ప్రచారం జరిగింది. కాగా.. సాయిరెడ్డి తిరిగి వైసీపీలోకి వెళ్తున్నారనే వాదన సోషల్ మీడియా వేదికగా వినిపించింది. ఈ సమయంలో తిరుమల కేంద్రంగా సాయిరెడ్డి కీలక ప్రకటన చేసారు. తన కొత్త పార్టీ ఏర్పాటు పైనా స్పష్టత ఇచ్చారు. తన అసలు లక్ష్యం ఏంటో వెల్లడించారు.

ఎట్టకేలకు విజయ సాయిరెడ్డి తన కొత్త పార్టీ పైన క్లారిటీ ఇచ్చారు. వైసీపీ హయాంలో నెంబర్ టూ గా వ్యవహరించిన విజయ సాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ప్రకటించనున్నారు. వైసీపీ ఓటమి తరువాత పార్టీలో వేగంగా చోటు చేసుకున్న పరిణామాలతో సాయిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు గా ప్రకటన చేసారు. వ్యవసాయం చేసుకుంటానని వెల్లడించారు. లిక్కర్ కేసులో సిట్ అధికారుల విచారణకు హాజరయ్యారు. జగన్ కోటరీలో చోటు చేసుకున్న పరిణామాల పైన కీలక వ్యాఖ్యలు చేసారు. అదే సమయంలో కేంద్రంలోని బీజేపీ నేతలతో మాత్రం సాయిరెడ్డి ఇప్పటికీ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారనే వాదన ఉంది. ఒక దశలో సాయిరెడ్డి బీజేపీలోకి వెళ్తారనే ప్రచారమూ జరిగింది. ఇక.. తన ఇంట్లో ఈడీ సోదాల తరువాత సీఎం చంద్రబాబు లక్ష్యంగా సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీలో సాయిరెడ్డి తిరిగి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం వేళ సాయిరెడ్డి ఇప్పుడు చేసిన ప్రకటన రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.

 పురందేశ్వరికి కీలక పదవి వెనుక - మోదీ మార్క్ లెక్కలు..!!
పురందేశ్వరికి కీలక పదవి వెనుక - మోదీ మార్క్ లెక్కలు..!!
vjaya-sai-reddy-big-announcement-over-his-new-political-party-and-agenda-here-the-details

సాయిరెడ్డి అసలు లక్ష్యం

కాగా, ఇప్పుడు సాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటన దాదాపు ఖరారైంది. పార్టీ పేరు 'భారత్ జన వికాస్' గా ఖరారైనట్లు ప్రచారం సాగింది. కాగా.. ఈ రోజు తిరుమలలో శ్రీవారిని దర్శనం చేసుకున్న సాయిరెడ్డి తన కొత్త పార్టీ పైన కీలక అంశాలను వెల్లడించారు. ఈ నెలలోనే కొత్త పార్టీ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నారు. ప్రజల తరపున....ప్రజల కోసం..ప్రజా పక్షంగా..ప్రజల గొంతు వినిపించేందుకు...నూతన పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లుగా స్పష్టం చేసారు. దీంతో.. ఇక సాయిరెడ్డి పార్టీ ఖాయమైంది. అయితే.. సాయిరెడ్డి ఒక్కరే ఈ పార్టీ ఏర్పాటు చేయటం లేదని.. ఆయన వెనుక కొందరు 'ముఖ్యులు' ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. తన పార్టీ ప్రకటన ద్వారా ప్రాంతాల వారీగా సభలు.. సమావేశాలు నిర్వహణ దిశగా సాయిరెడ్డి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్పుడు కూటమి- వైసీపీ మధ్య హోరా హోరీగా మారిన రాజకీయంలో సాయిరెడ్డి పార్టీ ఎలాంటి పాత్ర పోషిస్తుంది.. ఎవరి ఓట్లకు గండి కొడుతుందీ.. రాజకీయంగా ఎవరికి లాభం - నష్టం చేస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+