'ఇరుముడి' కి మించిన స్టోరీ, ఎమోషన్ తో విజయ్ ఆంటోని సినిమా.. ఆ రోజే రిలీజ్
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని అనగానే చాలామందికి 'బిచ్చగాడు' సినిమానే గుర్తుకొస్తుంది. తమిళంలో 2016 లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ మూవీ అదే ఏడాది తెలుగులో బిచ్చగాడు అనే పేరుతో రిలీజై ఇక్కడ కూడా అఖండ విజయం సాధించింది. ఈ చిత్రానికి శశి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత పూర్తిగా కంటెంట్ ఉన్న సినిమాలను తీస్తూ ప్రేక్షకులను ఎప్పటికప్పుడు మెప్పిస్తున్న హీరో విజయ్ ఆంటోని. ఇటీవల వంద దేవుళ్లు, మార్గన్, బిచ్చగాడు 2 లాంటి చిత్రాలతో అలరించారు. అయితే ఇప్పుడు మరోసారి కంటెంట్ ఉన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు విజయ్ ఆంటోని.. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'అప్పా కుట్టీ'.. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ తో ఈ మూవీ తెరకెక్కింది. ఇటీవల ఇదే ఎమోషన్ తో వచ్చిన మాస్ మహారాజ రవితేజ 'ఇరుముడి' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగులోనూ ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తెలుగులో నాన్న కుట్టి అనే టైటిల్ పెట్టారు. ఈ మూవీ అక్టోబర్ 16 న విడుదలకు సిద్ధం అయింది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేసింది.
నాన్న కుట్టి మూవీకి ము. మారన్ దర్శకత్వం వహించారు. ఇక విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ మీద మీరా విజయ్ ఆంటోని నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీకి సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ అధినేత రామంజనేయులు జవ్వాజీ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే రిలీజ్ అయిన కంటెంట్ చూస్తే యాక్షన్, కుటుంబ భావోద్వేగాలు, ఇంటెన్స్ డ్రామాగా ఈ మూవీని దర్శకుడు మారన్ తెరకెక్కించినట్లు స్పష్టం అవుతోంది. ఇక నాన్న కుట్టి సినిమాలో ప్రీతి అస్రాని, లిథన్య, భగవతి పెరుమాళ్ అలాగే హరిప్రియ, చిత్ర లక్ష్మణన్, శ్రీజ రవి, జాన్సన్ దివాకర్, కుమార్ నటరాజన్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు.

అలాగే రాజీవ్ రాజేంద్రన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. ఇక ఈ మూవీకి హీరోతో పాటు విజయ్ ఆంటోనీ సంగీతం అందించడం విశేషం. అంతేకాకుండా ఈ మూవీకి ఎడిటర్ కూడా ఆయనే. బిచ్చగాడులో తల్లి సెంటిమెంట్ తో ప్రేక్షకుల హృదయాల్ని కదిలించిన విజయ్ ఆంటోని ఇప్పుడు తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ తో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేందుకు వస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.












Click it and Unblock the Notifications
