టీడీతో పొత్తు వేళ జగన్ కు మోదీ బిగ్ ఆఫర్ - బయట పెట్టిన సాయిరెడ్డి..!!
ఏపీలో ఎన్నికల సమరం హోరా హోరీగా సాగుతోంది. మూడు పార్టీల కూటమి వర్సస్ వైసీపీ మధ్య ప్రధాన పోటీ కొనసాగుతోంది. బీజేపీతో పొత్తు కోసం తాను చాలా కష్టపడ్డానని పవన్ చెబుతూ వచ్చారు. బీజేపీ ఆహ్వానం మేరకు తాము ఎన్డీఏలో చేరామని టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. అయితే, అసలు టీడీపీతో పొత్తు ఖరారు వేళ ఢిల్లీ కేంద్రంగా చోటు చేసుకున్న పరిణామాలను వైసీపీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డి వెల్లడించారు.
పొత్తు వేళ ఢిల్లీలో
బీజేపీ -టీడీపీ పొత్తుకు ముందు ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షా , నడ్డాతో భేటీ అయ్యారు. పొత్తుకు సూత్రప్రాయంగా అంగీకారం జరిగింది. ఆ మరుసటి రోజునే చంద్రబాబు ఢిల్లీలో ఉండగానే జగన్ ఢిల్లీ వెళ్లారు. పార్లమెంట్ హౌస్ లోనే ప్రధాని మోదీతో సీఎం జగన్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. అటు చంద్రబాబుతో చర్చలు చేస్తూ..జగన్ తో మంత్రాంగం పైన రాజకీయంగా ఆసక్తి కర చర్చ సాగింది. ఆ తరువాత టీడీపీ -బీజేపీ పొత్తు పైన ప్రకటనకు గ్యాప్ వచ్చింది. దీంతో, ఆ సమయంలో పొత్తు పైన సందేహాలు మొదలయ్యాయి. అయితే, ప్రధానితో జగన్ సమావేశం అయిన సమయం లో వచ్చిన ఆఫర్ ఏంటో సాయిరెడ్డి చెప్పుకొచ్చారు.

ఎన్డీఏలోకి వైసీపీకి ఆహ్వానం
టీడీపీతో పొత్తు పైన నిర్ణయానికి రావటానికి ముందు జగన్ తో ఆ భేటీలో చర్చ జరిగిందని చెప్పుకొచ్చారు. ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన సాయిరెడ్డి ఈ విషయాన్ని చెప్పారు. ఎన్డీఏలో చేరాలని తొలుత తమ పార్టీకి ఆఫర్ వచ్చిందని..ఆ భేటీలో ఈ అంశం పైనే చర్చ జరిగిందని చెప్పుకొచ్చారు. అయితే, తమ పార్టీ విధి విధానాల కారణంగా పొత్తు సాధ్యం కాదని చెప్పినట్లు స్పష్టం చేసారు. అయితే, టీడీపీ -బీజేపీతో పొత్తు కారణంగా కొంత ఇబ్బందులు తమకు ఉంటాయని సాయిరెడ్డి అంగీకరించారు. అయితే, ఎన్నికల సంఘం..న్యాయస్థానాల పైన నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. నెల్లూరులో వేమిరెడ్డి ఎన్ని వందల కోట్లు ఖర్చు చేసినా తాను గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు.

గవర్నర్ కావాలని కోరిక
తాను విశాఖ నుంచి పోటీ చేయాలని భావించానని సాయిరెడ్డి చెప్పారు. విశాఖ కేంద్రంగా తన పైన వచ్చిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఇక..నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని స్థానాల్లోనూ విజయం సాధిస్తామని ధీమాగా చెప్పారు. పవన్ తనకు చిన్ననాటి స్నేహితుడని..తనను పవన్ ఎప్పుడూ విమర్శించలేదని..తాను పవన్ ను విమర్శించలేదని చెప్పారు. తారకరత్న వివాహం వారి కుటుంబ సభ్యులు అంగీకరంచలేదని..వారికి తాను మద్దతుగా నిలిచానన్నారు. ఇక..తాను గవర్నర్ కావాలనేది తన కోరికగా చెప్పిన సాయిరెడ్డి..ఇదే విషయాన్ని జగన్ కు చెప్పానన్నారు. జగన్ ఏం ఆదేశిస్తే తాను పాటిస్తానని సాయిరెడ్డి తేల్చి చెప్పారు.
-
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు












Click it and Unblock the Notifications