ఎక్కడ బాగా నటిస్తున్నాడు? కుదిరితే క్షమించు: పవన్‌కు 'అత్తారింటికి దారేది' ఝలక్

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారు. ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కూడా టార్గెట్ చేశారు. అలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించి ఒకటి రెండుసార్లు తడబడిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై సెటైర్లు వేశారు.

అత్తారింటికి దారేది డైలాగ్

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోను పెట్టి.. విజయసాయి ఓ ట్వీట్ చేశారు. జనసేన పార్టీని మేం గుర్తించడం లేదని విజయసాయి తాను చెప్పినట్లుగా పేర్కొన్నారు. దీనిపై పవన్... చంద్రబాబుతో చెబుతున్నట్లుగా సెటైర్ వేసారు. నువ్వు ఆడమన్నట్లు ఆడినందుకు ఇది నా పార్టీ పరిస్థితి, కుదిరితే క్షమించు, లేదా శిక్షించు... కానీ నాదీ ఒక పార్టీ అని కనీసం గుర్తించమని చెప్పండి పార్ట్‌నర్.. చెప్పండి, అత్తారింటికి దారేది సినిమా డైలాగ్‌లా పొందుపర్చారు.

చంద్రబాబుపై విజయసాయి ఆరోపణ

చంద్రబాబుపై విజయసాయి ఆరోపణ

తెరాస మళ్లీ గెలిస్తే చర్లపల్లి జైలుకు వెళ్లక తప్పదని చంద్రబాబు భయపడుతున్నారని, ఓటుకు నోటు కేసు చివరి దశకు వచ్చినందున నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని, రూ.1200 కోట్లు సరిపోకుంటే మరో రూ.500 కోట్లు ఏర్పాటు చేస్తానని నిన్న రాత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తన నివాసానికి పిలిపించి చెప్పారని ఆరోపించారు.

పవన్ కళ్యాణ్ పైన మరో ట్వీట్

అత్తారింటికి దారేది సినిమాలో ఓ ఫొటో క్లిప్‌ను, అలాగే, ఇటీవల జనసేన పోరాటయాత్రలో భాగంగా ఓ కుటుంబంతో పవన్ కళ్యాణ్ నేలపై కూర్చుని మాట్లాడుతున్న ఫొటోతో కలిపి తయారు చేసిన ఫోటోను విజయ సాయిరెడ్డి తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 'పవన్ సినిమాల్లో బాగా నటిస్తున్నాడా? లేక నిజజీవితంలో బాగా నటిస్తున్నాడా?' అని పేర్కొన్నారు. సినిమాల్లో బాగా నటిస్తే 'ఏ' అనీ, నిజజీవితంలో బాగా నటిస్తే 'బీ' అని రేటింగ్ ఇవ్వాలన్నారు.

బాలకృష్ణపై విజయసాయి

ఐటీ స్పెల్లింగ్ తెలియని తెలంగాణ వాళ్లకు చంద్రబాబు ఐటీ డెఫినేషన్ నేర్పించాడని బాలకృష్ణ తెలంగాణ అసెంబ్లీ ప్రచారంలో చెప్పిన వ్యాఖ్యలపై సెటైర్ వేశారు. మీకు మెంటల్ అనే పదానికి స్పెల్లింగ్ నేర్పింది కూడా ఆయనేనా అని సెటైరిక్‌గా పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+