విజయసాయితో దళారి పనులు చేయించి: జగన్‌పై దేవినేని తీవ్ర వ్యాఖ్యలు
అమరావతి: తమ పార్టీ లోకసభ సభ్యులతో రాజీనామా చేయిస్తానని ప్రకటించిన వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి, వేమిరెడ్డిలతో ఎందుకు రాజీనామా చేయించడం లేదని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ప్రశ్నించారు.
వారిద్దరితోను రాజీనామా చేయించాలని సవాల్ చేశారు. విజయ సాయి రెడ్డితో దళారి పనులు చేయించి కేసుల నుంచి బయట పడాలని జగన్ చూస్తున్నారని మండిపడ్డారు.

బెయిల్ కోసం నాడు యూపీయేతో జగన్ కుమ్మక్కయ్యారని, ఇప్పుడు కేసుల మాఫీ కోసం రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంత పెద్ద రాజధానిని ఎందుకు అని అవహేళన చేస్తారా అని నిలదీశారు. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదా అన్నారు.












Click it and Unblock the Notifications