జలజగడంతో రెండు రాష్ట్రాల మధ్య అగ్గి .. కసితో పిశాచంలా చంద్రబాబు : సాయిరెడ్డి ధ్వజం
వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై నిత్యం సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసే విజయసాయిరెడ్డి తాజాగా తెలుగు రాష్ట్రాల మధ్య చోటు చేసుకున్న జలవివాదం విషయంలోనూ, ఫైబర్ గ్రిడ్ వ్యవహారంలోనూ, ప్రాజెక్టుల వివాదాల్లోనూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పాత్రపై సంచలన పోస్టులు పెట్టారు.

జలజగడంతో రెండు రాష్ట్రాల ఘర్షణల కోసం గోతి కాడ నక్కలా చంద్రబాబు
జల జగడం గురించి రెండు రాష్ట్రాల మధ్య అగ్గి రాజుకోవాలని బాబు గోతి కాడ నక్కలాగా కాచుకు కూర్చున్నాడు అంటూ విమర్శలు గుప్పించిన విజయసాయిరెడ్డి, టిడిపి నేతలు రోజుకొక రకంగా పొంతన లేని ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఎల్లో మీడియా, ఆ పార్టీ చోటామోటా లీడర్లు బాధ్యత లేకుండా వక్రభాష్యాలు చెబుతున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. కేంద్రం న్యాయం చేస్తుందనే భావిస్తున్నాం అంటూ విజయసాయిరెడ్డి జల వివాదాలపై కేంద్రం చొరవ తీసుకొని సమస్యను పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల నేపథ్యంలో తీవ్ర ఘర్షణ జరగాలని చంద్రబాబు గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడని మండిపడ్డారు.

పప్పు గ్రిడ్ అంటూ ఫైబర్ గ్రిడ్ వ్యవహారంపై సాయిరెడ్డి సైరా పంచ్
ఇదే సమయంలో సైరా పంచ్ వేసిన విజయసాయిరెడ్డి ప్రొఫైల్ పిక్స్ మార్చి కక్షసాధింపు అని పచ్చ మీడియా లో డిబేట్లు పెడుతున్నారని ఫైబర్ గ్రిడ్ వ్యవహారం పై నిప్పులు చెరిగారు. పప్పు గ్రిడ్ అంటూ లోకేష్ బినామీ వేమూరి హరికృష్ణ, ఎల్ 1 ని కాదని ఎల్ 3 బినామీ సంస్థ టెరా సాఫ్ట్ కు టెండర్లు .. 1500 సెటాప్ బాక్స్ ధరను 4000 గా నిర్ణయించి బినామీ హరికృష్ణ కి కాంట్రాక్ట్ ... తండ్రి శాఖలోని ఫైల్ తప్పించుకొని రెండు వేల కోట్ల ఫైబర్ ఫ్రాడ్ కు లొకేష్ సంతకం .. ఇక సిఐడి విచారణ జరిగితే ఆప్షన్ 1 స్టే .. ఆప్షన్ 2 రమేష్ హాస్పిటల్ అంటూ ఫైబర్ గ్రిడ్ ని టార్గెట్ చేస్తూ సైరా పంచ్ వేశారు.

కసి పెంచుకున్న చంద్రబాబు ఓ పిశాచంలా దాపురించాడు
అంతేకాదు అప్పట్లో పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు నిలిపివేయాలని ప్రకాశం బ్యారేజీపై ధర్నాలు చేయించాడని, కృష్ణా డెల్టా ఎడారే అవుతుందని దుష్ప్రచారం చేశాడని విజయసాయిరెడ్డి చంద్రబాబుపై మండిపడ్డారు. రెండేళ్లుగా అన్ని ఎన్నికల్లో జనం చెప్పు తో కొట్టిన తర్వాత రాష్ట్రం సుభిక్షంగా ఉండకూడదని కసి పెంచుకున్న చంద్రబాబు ఓ పిశాచంలా దాపురించాడు అంటూ చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి నిప్పులు చెరిగారు.

క్షేత్ర స్థాయి పర్యటనలకు జగన్ శ్రీకారం .. జగన్ పాలనపై కితాబు
ఇదే సమయంలో ఇంతకాలం కరోనా మహమ్మారి కారణంగా క్షేత్రస్థాయి పర్యటనలకు దూరంగా ఉన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక నుండి జిల్లాల వారీగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయనున్నారని వెల్లడించారు. ప్రతిపక్షాలు ఎంత పాలన అడ్డుకునే ప్రయత్నాలు చేసినా, సంక్షేమ పథకాల అమలును స్వయంగా పరిశీలించేందుకు ముందుగా ఆయన గ్రామ సచివాలయాలను సందర్శించనున్నారు అని వెల్లడించారు విజయసాయిరెడ్డి.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications