'నిజం చెప్పులు తొడుక్కునే లోపు అబద్దం పరారైపోయింది'.. రవిప్రకాష్ పై విజయసాయి రెడ్డి ట్వీట్!

టీవీ9 మాజీ సీఈవో ర‌వి ప్ర‌క‌రాశ్‌పై వైసీపీ ఎంపీ విజ‌య సాయిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. ర‌వి ప్ర‌కాశ్‌ను మీడియా న‌యీంగా పేర్కొన్నారు. ఆయ‌న ఇప్ప‌టికే బోర్డ‌ర్ దాటేసాడని ట్వీట్ చేసారు. అదే స‌మ‌యంలో ర‌వి ప్ర‌కాశ్‌ను ఏ బాబు ర‌క్షిస్తాడో చూడాలి అంటూ కామెంట్ చేసారు. ఇక‌, చంద్ర‌బాబు స‌మీక్ష‌ల గురించీ సాయిరెడ్డి ట్వీట్‌లో వ్యంగోక్తులు విసిరారు.

ర‌వి ప్ర‌కాశ్ పైన సాయిరెడ్డి సంచ‌ల‌న ట్వీట్లు..
వైసీపీ ఎంపీ విజ‌య సాయిరెడ్డి టీవీ9 మాజీ సీఈవో ర‌వి ప్ర‌కాశ్ పైన చేసిన ట్వీట్లు ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. ర‌వి ప్ర‌కాశ్‌ను ఉద్దేశించి ఆయ‌న మీడియా న‌యీం అంటూ కామెంట్ పోస్ట్ చేసారు. పోలీసులు వ‌స్తే ఇంట్లో క‌నిపించ‌డు..నోటీసుల‌కు స్పందించ‌డు..ప‌రారీలో లేనంటాడు అంటూ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. పోలీసులు .. చట్టాలు..కోర్టులు త‌నంత‌టి ప్ర‌వ‌క్త‌ను ముట్టుకోలేర‌నే భ్ర‌మ‌లో ఉన్నాడ‌న్నారు. బెయిల్ పిటీష‌న్‌ను కోర్టు కొట్టేసింది. త‌ప్పించుకొనే దారున్న‌లీ బంద్ అయ్యాయి..ఇక ఈ మీడియా న‌యీంను ఏ బాబు రక్షిస్తాడో చూడాలి అని పేర్కొన్నారు. నిజం చెప్పులు తొడుక్కునే లోపు అబద్దం ప‌రారైపోయింది. విచార‌ణ‌కు రండి అని పోలీసులు మ‌ర్యాద‌గా రవి ప్ర‌కాశ్ ఇంటికి నోటీసేలు అంటిస్తుంటే..న‌కిలీ ప్ర‌వ‌క్త రాత్రికి రాత్రి దొడ్డి దారిలో గోడ దూకేసీ బోర్డ‌ర్ దాటేసాడంటూ ట్వీట్‌లో వివ‌రించారు. రేపో మాపో మాల్యాతో సెల్ఫీ దిగుతూ క‌నిపించి ప‌ట్టుకోండి చూద్దాం అంటాడేమో అని విజ‌య సాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.

Vijaya Sai Reddy tweeted TV9 Ravi Prakash as Media Nayeem : its became sensational

చంద్ర‌బాబు పైనా ఇలా..
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు పైనా విజ‌య సాయిరెడ్డి ట్వీట్లు కొన‌సాగిస్తున్నారు. చంద్ర‌బాబు పోలింగ్ స‌ర‌ళి పైన స‌మీక్ష‌లు నిలిపివేయ‌టం పైన ట్వీట్ చేసారు. సొంత పార్టీ నేత‌లే ఎక్క‌డిక‌క్క‌డ వెన్నుపోటు పొడిచారంటూ ఎన్నిక‌ల స‌మీక్ష‌ల్లో త‌మ్ముళ్లు బావురుమంటుంటే వారిని ఎలా ఓదార్చాలో తెలియ‌క బాబు బిక్క చచ్చిపోతున్నారట. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నూరిపోయడం సంగతి సరే. సమీక్షలను ఇలాగే కొనసాగిస్తే కౌంటింగ్‌కు ముందే కొంప కొల్లేరని గ్రహించే రద్దు చేశారట.' అంటూ విజయసాయి రెడ్డి ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. సాయిరెడ్డి వ‌రుస‌గా చేస్తున్న ఈ ట్వీట్లు కార‌ణంగా టీడీపీ నేత‌లు సైతం సాయిరెడ్డి మీద అనేక ఆరోప‌ణ‌లు చేసారు. అయినా, సాయిరెడ్డి మాత్రం వెన‌క్కు త‌గ్గ‌టం లేదు. రాజ‌కీయంగా టీడీపీని టార్గెట్ చేస్తూ..వైసీపీకి వ్య‌తిరేకంగా ప‌ని చేసిన వారిని ల‌క్ష్యంగా చేసుకుంటూ సాయిరెడ్డి ట్వీట్ల యుద్దం కొన‌సాగిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+