టిలో చెప్పులేశారు: విజయమ్మ అలకపాన్పు!(పిక్చర్స్)

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ నల్గొండ, ఖమ్మం జిల్లా పర్యటనలు గురువారం ఉద్రిక్తంగా మారాయి. పైనంపల్లి మరో మానుకోటను తలపించింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమైక్య గళం వినిపించడంతో ఆమెకు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడ్డాయి. తెలంగాణవాదులు ఆమెపై కోడిగుడ్లు, చెప్పులతో దాడి చేశారు.

దీంతో పర్యటనను అర్ధాంతరంగా ముగించుకోవాల్సి వచ్చింది. విజయమ్మ నిరసనల మధ్యే ఖమ్మం జిల్లాలో ఆమె పర్యటించినా.. నల్లగొండ జిల్లాలో అడుగు కూడా పెట్టలేకపోయారు. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు ఆమెను ముందస్తుగానే అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు.

భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు కృష్ణా జిల్లా నుంచి గురువారం ఉదయం ఆమె ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించారు. దారి పొడవునా ఆమె కాన్వాయ్‌ని తెలంగాణవాదులు అడ్డుకున్నారు. కాగా, తొలుత మధిర మండలంలోని సిరిపురం, కలకోటల్లో పంటలను విజయమ్మ పరిశీలించారు.

విజయమ్మ 1

విజయమ్మ 1

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ తెలంగాణ పర్యటన గురువారం ఉద్రిక్తతకు దారి తీసింది. ఆమెను తెలంగాణవాదులు అడుగడుగునా అడ్డుకున్నారు.

విజయమ్మ 2

విజయమ్మ 2

కొణిజర్ల మండలం పల్లిపాడుకు చేరుకోగానే తెలంగాణవాదుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. నటకాచ కామేపల్లి మండలాధ్యక్షుడు తురకదాస్ పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

విజయమ్మ 3

విజయమ్మ 3

భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు కృష్ణా జిల్లా నుంచి గురువారం ఉదయం ఆమె ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించారు.

విజయమ్మ 4

విజయమ్మ 4

విజయమ్మ నిరసనల మధ్యే ఖమ్మం జిల్లాలో ఆమె పర్యటించారు. అయితే నల్లగొండ జిల్లాలో అడుగు కూడా పెట్టలేకపోయారు! ఆ లోపే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విజయమ్మ 5

విజయమ్మ 5

భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు కృష్ణా జిల్లా నుంచి గురువారం ఉదయం ఆమె ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించారు.

విజయమ్మ 6

విజయమ్మ 6

ఖమ్మం, నల్లగొండ జిల్లాల సరిహద్దు గ్రామమైన పైనంపల్లి బ్రిడ్జి వద్ద ఆమెను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. దీంతో, ఆమె వాహనం దిగి రోడ్డుపైనే బైఠాయించారు. ఆ తర్వాత ఉద్రిక్తల మధ్య ఆమెను అదుపులోకి తీసుకొని తరలించారు.

విజయమ్మ 7

విజయమ్మ 7

అంతకుముందు విజయమ్మ నేలకొండపల్లిలో "తెలంగాణ వచ్చే ప్రసక్తే లేదు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుంది. రాష్ట్రంలో 60 శాతం మందికిపైగా ప్రజలు సమైక్య వాదాన్ని కోరుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ఏర్పాటు ఎలా సాధ్యమవుతుంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబోదు'' అని వ్యాఖ్యానించారు.

విజయమ్మ 8

విజయమ్మ 8

దారి పొడవునా ఆమె కాన్వాయ్‌ని తెలంగాణవాదులు విజయమ్మను అడ్డుకున్నారు. పలుచోట్ల ఆమె ప్రయాణిస్తున్న వాహనంపైకి కోడిగుడ్లు, చెప్పులు విసిరారు.

విజయమ్మ 9

విజయమ్మ 9

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పర్యటనను నిరసిస్తూ నల్గొండ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేసిన వైయస్ విగ్రహం.

విజయమ్మ 10

విజయమ్మ 10

నేలకొండపల్లి మీదుగా నల్లగొండ జిల్లా కోదాడలోకి ప్రవేశించేందుకు విజయమ్మ ప్రయత్నించారు. అయితే, నల్లగొండ జిల్లా శాంతినగర్ వద్ద తెలంగాణ వాదులు మోహరించి ఉండడంతో ఆమెను ముందుగానే వెనక్కి పంపేందుకు రెండు జిల్లాల పోలీసులు ప్రయత్నించారు.

విజయమ్మ 11

విజయమ్మ 11

విజయమ్మ పర్యటనను విజయవంతం చేసేందుకు స్థానిక ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేయగా, ఓయూ ఐకాస, నల్లగొండ ఐకాస విద్యార్థులు వందల సంఖ్యలో కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో మకాం వేయడంతో బుధవారం నుంచే జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+