చంద్రబాబు నిక్కర్ వేసుకున్నప్పుడే..: విజయమ్మ
ఏలూరు/ అనంతపురం: హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెబుతున్నారని, అయితే చంద్రబాబు నిక్కరు వేసుకున్న రోజుల్లోనే దేశంలో హైదరాబాద్ ఐదో స్థానంలో ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో పార్టీ కార్యాలయాన్ని విజయలక్ష్మి బుధవారం ప్రారంభించారు. అనంతరం జరిగిన జనభేరీలో మాట్లాడారు.
తెలుగుదేశం నేత చంద్రబాబునాయుడు చెప్పే మాయమాటలు నమ్మొద్దని, చంద్రబాబుపై 18 కేసులు ఉన్నాయని ఆరోపించారు. బాబు తొమ్మిదేళ్ల పాలనలో తినడానికి తిండి లేక, పొలాలకు, పశువులకు నీరు లేక రైతులు అల్లాడారన్నారు. చంద్రబాబు పాలనలో రైతులకే కాక అన్ని వర్గాలకు నష్టం జరిగిందన్నారు.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వందల ఎకరాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించి అనేక కుంభకోణాలకు పాల్పడ్డారని, వీటికి సంబంధించి చంద్రబాబుపై అనేక కేసులు నమోదయ్యాయని, స్టే తెచ్చుకుని బతుకుతున్నారని ఆమె అన్నారు. తన వ్యాఖ్యలు తప్పని నిరూపించేందుకు చంద్రబాబు దర్యాప్తునకు సిద్ధపడతారా అని విజయలక్ష్మి సవాల్ విసిరారు.
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు పచ్చి అబద్ధాల కోరు అని వైయస్సార్ కాంగ్రెసు అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్ర బాబు నోటి వెంట నిజంవస్తే ఆయన తల వెయ్యి ముక్కలవుతుందంటూ ఓ ముని శాపం పెట్టారని ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లాలో వైయస్ జగన్ ఎన్నికల ప్రచారం రెండో రోజు బుధవారం కూడా కొనసాగింది.
పురాణాల్లో చెప్పిన రామరాజ్యాన్ని ఇంతవరకూ ఎవరూ చూడలేదని తమ పార్టీకి ఓటేస్తే ఆ రామరాజ్యాన్ని స్థాపిస్తానన్నారు. అమలు కాని హామీలతో చంద్రబాబు ప్రజలను వంచిస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన తొమ్మిదేళ్ల పాలన చీకటిమయమని విమర్శించారు.












Click it and Unblock the Notifications