వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ నిర్ణయంతో రాష్ట్రాన్ని దివాలా తీయిస్తారా అని మాత్రం రెచ్చిపోకండి... చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు

|
Google Oneindia TeluguNews

ఎవరూ ఊహించని విధంగా నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాపాడడం కోసం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంజనేయరెడ్డి కమిటీ... సీఎం జగన్‌కు మధ్యంతర నివేదికను అందించింది. ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనానికి సంబంధించి ఈ కమిటీ సానుకూలత వ్యక్తం చేయడంతో జగన్ సర్కార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక దీనిని ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయం చేస్తారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.

తిరుపతి పుణ్య క్షేత్రంలో కక్కుర్తి పడ్డాడు .. నిలువు దోపిడీకి గురయ్యాడుతిరుపతి పుణ్య క్షేత్రంలో కక్కుర్తి పడ్డాడు .. నిలువు దోపిడీకి గురయ్యాడు

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై నేడు జరగనున్న కేబినెట్ భేటీలో కీలక చర్చ జరగనుంది.
ఇక ఈ అంశంపై ఆంజనేయ రెడ్డి కమిటీ నివేదిక ఇచ్చిన అనంతరం రవాణాశాఖ మంత్రి పేర్ని నాని, ఆర్థిక మంత్రి బుగ్గన, ఆర్టీసీ, రవాణా అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పేర్ని నాని జగన్ తీసుకున్న సంచలన నిర్ణయం పై మాట్లాడుతూదశాబ్దాల ఆర్టీసీ ఉద్యోగుల కలను సీఎం జగన్ నెరవేర్చబోతున్నట్టు వెల్లడించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయబోతున్నారని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్న ఆయన ప్రభుత్వంలో కొత్తగా ప్రజారవాణా విభాగం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రజారవాణా విభాగంలోకి తీసుకుంటామని వివరించారు.త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి విధి విధానాలు ప్రకటిస్తామని అన్నారు.

vijayasai criticism on the tdp chief chandrababu about APSRTC merger issue

ఇక ఆర్టీసీ గురించి జగన్ తీసుకున్న నిర్ణయంపై నష్టాల్లో ఉన్న ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో కలపడం సీఎం వైఎస్ జగన్ తీసుకున్న గొప్ప నిర్ణయమని, చంద్రబాబు దాన్ని కూడా రాజకీయం చేసే ఆలోచనలో ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "ఆర్టీసిని విలీనం చేసి 60 వేల మంది ఉద్యోగులను గవర్నమెంటులోకి తీసుకోవడం కొడిగడుతున్న దీపానికి ప్రాణం పోశారు జగన్ గారు. ప్రగతి చక్రాలిక జగన్నాథ రథచక్రాల్లా పరుగులు పెడతాయి. రాష్ట్రాన్ని దివాలా తీయిస్తారా అని మాత్రం రెచ్చిపోకండి చంద్రబాబునాయుడు గారూ. నవ్వుతారు" అని చంద్రబాబును ఉద్దేశించి ఆర్టీసీ అంశాన్ని రాజకీయం చేయొద్దంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.

English summary
YSR Congress MP Vijayasai Reddy has criticized chandrababu about the merger APS RTC in the government issue . Jagan's decision on the RTC is a good decision and the opposition leader chandrababu wants to politicise the issue with his polictics .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X