విజయసాయి రెడ్డికి మరో కీలక బాధ్యత అప్పగించిన జగన్
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరో కీలక బాధ్యతను నిర్వహించనున్నారు. విజయసాయిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా నియమితులయ్యారు.
ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నియామకంపై పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి అనంతకుమార్‌కు, రాజ్యసభ, లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు లేఖను అందజేశారు. కొన్నిరోజుల కిందటి వరకు పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న సీనియర్ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

డాక్‌యార్డులో స్థానికులకే ఉద్యోగావకాశాలు
విశాఖ నావల్ డాక్‌యార్డ్‌లో అప్రెంటీషిప్ చేసిన వారికి ఇది శుభవార్తు. ఎందుకంటే.. నావల్ డాక్‌యార్డ్‌లో గతంలో అప్రెంటీస్‌లుగా పనిచేసిన వారికి ఉద్యోలిస్తామని రక్షణశాఖ సహాయ మంత్రి సుభాష్ భామ్రే హామీ ఇచ్చారు.
నావల్ డాక్‌యార్డ్‌లో స్థానికులకు ఉద్యోగ అవకాశం ఇవ్వాలని వైయస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సోమవారం రాజ్యసభలో కేంద్రాన్ని కోరగా.. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.












Click it and Unblock the Notifications