• search
 • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అయ్యన్న, ఆయన తనయుడు, ఓ డాక్టర్.. అల్లుడి భూ గిల్లుడు: చంద్రబాబు దుర్యోధనుడైతే..

|

అమరావతి: గత కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో ఏం చేసిందనే విషయంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి వరుసగా సిరీస్ రూపంలో ఎండగడుతున్న విషయం తెలిసిందే. తాజాగా, విశాఖ కంటకుడు చంద్రబాబు part -5 అంటూ సోషల్ మీడియా వేదికగా మరో భాగాన్ని విడుదల చేశారు. విశాఖను చంద్రబాబు సర్కారు విచ్ఛిన్నం చేసిందంటూ దుయ్యబట్టారు.

బాబు కుట్రలో విశాఖ జిల్లా

బాబు కుట్రలో విశాఖ జిల్లా

‘సొంత కంపెనీ హెరిటేజ్ కోసం విశాఖ జిల్లాలో ముఖ్యంగా దక్షిణ, నైరుతి, పశ్చిమ విశాఖ జిల్లాలో సహకార సంఘాలను ధ్వంసం చేశాడు చంద్రబాబు. చంద్రన్న కానుకంటూ ఇచ్చిన పప్పు బెల్లాల్లో బెల్లంను అనకాపల్లి మార్కెట్ నుంచి కొనకుండా... కమీషన్ల కోసం మహారాష్ట్ర నుంచి తెప్పించిన ఘనత చంద్రబాబుది. చిత్తూరు డైరీని మూసివేయించిన బాబు... విశాఖ డైరీని ఒక కుటుంబ సంస్థగా మార్చేసి ఉద్యోగులు, రైతులతో ఆటాడుకున్నాడు. తన 14 ఏళ్ల పాలనలో ఇలా చెప్పుకుంటూ పోతే విశాఖ బీచ్ నుంచి ఏజెన్సీ బాక్సైట్, లేటరైట్ వరకు అన్ని అక్రమాలే. చంద్రన్న హయాంలో అయ్యన్నపాత్రుడు, అతను కుమారుడు లాంటివారైతే చెలరేగిపోయారు. చంద్రన్న అక్రమాలకన్నా ముందు అయ్యన్న అరాచకాలను, అప్పట్లో మరో మంత్రి అల్లుడు గిల్లుడును ఒక్కసారి చూద్దాం' అంటూ విజయసాయి మొదలుపెట్టారు.

అయ్యన్న, ఆయన తనయుడు, ఓ డాక్టర్..

అయ్యన్న, ఆయన తనయుడు, ఓ డాక్టర్..

‘అల్లూరి ఉద్యమానికి ఊపిరిలూదిన నర్సీపట్నాన్ని సొంత జాగీరుగా మార్చేశాడు అయ్యన్న పాత్రుడు అతని కుమారుడు చింతకాయల విజయ్. నర్సీపట్నంలో డాక్టర్లతో రాజకీయం చేయించిన చరిత్ర అయ్యన్నది. ప్రసవ వేదనతో బాధపడుతున్న మహిళలను సైతం గాలికొదిలేసి - అయ్యన్న సేవలో తరించాడు ఒక మత్తు డాక్టర్. ఇప్పటి జగన్ గారి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలన్న ఉద్దేశంతో డాక్టర్లతో అయ్యన్న చేసిన రాజకీయాలను అందరికీ తెలిసిందే. సుదీర్ఘకాలం రాష్ట్ర మంత్రిగా అయ్యన్న చేసినా నర్సీపట్నంకి చేసింది శూన్యం. భోగాపురం, నక్కపల్లి, విశాఖదగ్గర నరవ, గోలిగొండ, బెంగళూరులో భూములు, ఆస్తులను మాత్రం బాగా కూడబెట్టుకున్నారు. అయ్యన్న పాత్రుని కుమారునికి బెంగళూరులో సోలార్ ప్లాంట్లు , కంపెనీలు పెట్టేంత డబ్బెక్కడనుంచి వచ్చిందో?' అంటూ విజయసాయి వ్యంగ్యస్త్రాలు సంధించారు.

కుమారుడి కోసం అయ్యన్న పాట్లు..

కుమారుడి కోసం అయ్యన్న పాట్లు..

‘గిట్టనివారికి, అధికారులపై అయ్యన్న దూషణల పర్వం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఒక మహిళా అధికారిణికి గుడ్డలూడదీయిస్తానన్న ఆయనపై ఈ మధ్యే నిర్భయకేసు సైతం నమోదయ్యింది. అయ్యన్న పాత్రుడు మంత్రిగా ఉన్నప్పుడు అవినీతి పేరుతో ఆయన ఓఎస్డీ, పీఎస్ ను తొలిగించారు. అయితే అసలు అవినీతి చేసింది మాత్రం ఆయన కుమారుడు విజయ్ అని ఆయన సొంత మనుషులే చెప్పుకుంటారు. సొంత కుమారుడిని కాపాడేందుకు అనవసరంగా ఉద్యోగులను మాత్రం బలిచేశారు. తమ నియోజకవర్గంలో లేదా తమ ప్రాంతంలో మంచి రోడ్లు వేయించుకోవాలని ఎవరైనా ప్రజా ప్రతినిధి ప్రయత్నిస్తారు. కానీ అయ్యన్న పాత్రుని బ్యాచ్ మాత్రం చింతపల్లి, పాడేరుల్లో రోడ్ల విషయంలో చేసిన అవినీతి కంపు రాష్ట్రమంతా పాకింది. నర్సీపట్నం, చితపల్లి , పాడేరు గిరిజన ప్రాంతాల్లో రోడ్లకు టెండర్లు వేయకుండా అడ్డుకోవడం - కమీషన్లు కొట్టేయడం అబ్బో ఒకటేమిటి' అంటూ విజయసాయి చురకలంటించారు.

అయ్యన్నకు గంజాయి సాగుతో లింకు..?

అయ్యన్నకు గంజాయి సాగుతో లింకు..?

‘సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న అయ్యన్న నర్సీపట్నం ప్రాంతానికి ఒక సాగునీటి లేదా తాగునీటి ప్రాజెక్టు తెచ్చారా. సహజ వనరులకు పెట్టింది పేరైన కనీసం ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ స్థాపించే పాపానికి పోలేదు. నర్సీపట్నం మెట్ట భూముల్లో ఉద్యానవన పంటలు పండించేందుకు ఆస్కారముంది. కానీ ఆ దిశగా ప్రజల్లో ఒక అవగాహన కల్పించడంగానీ... ప్రోత్సహించడంకానీ చేయలేదు. గిరిజన లేదా ఇతర వ్యవసాయ ఉత్పత్తులకోసం ఒక కోల్డ్ స్టోరేజీనో లేదా గిడ్డంగినో కట్టించిన పాపానపోలేదు అయ్యన్న. అక్రమ మైనింగ్, గంజాయి రవాణాలోనూ అయ్యన్న పాత్ర గురించి నర్సీపట్నంవాసులు కథలు కథలుగా చెప్పుకుంటారు. తెలుగుదేశం హయాంలో మరోమంత్రిగా పనిచేసిన వ్యక్తే అయ్యన్నకు గంజాయికి లింక్ ఉందని గొడవ చేసిన సందర్భం. అమాయక గిరిజనులతో గంజాయి సాగు చేయించి ... వారిని బలిపశువులను చేయించడం చాలా మంది నీచ రాజకీయ నాయకులకు అలవాటు... అలాంటివారిలో ఒకరిగా అయ్యన్న మారిపోయాడా ?' అంటూ విజయసాయి ప్రశ్నించారు.

చంద్రబాబు దుర్యోధనుడు.. అయ్యన్న దుశ్శాసునుడు..

చంద్రబాబు దుర్యోధనుడు.. అయ్యన్న దుశ్శాసునుడు..

‘కొడుకు కోసం రాజకీయంగా సొంత సోదరుణ్ణే వేధించిన వ్యక్తి అయ్యన్న. నోరు తెరిస్తే బూతు మాటలతో విరుచుకుపడే నీ ఆటలు జగన్ గారి హయాంలో అయితే సాగవు. మహిళల భద్రత విషయంలో చంద్రబాబు దుర్యోధనుడైతే... అయ్యన్న దుశ్సాసునుడని చెప్పుకుంటారు నర్సీపట్నంవాసులు. విశాఖను రాజధాని చేసేందుకు కరోనా కేసుల్ని దాచిపెడుతున్నారంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన అయ్యన్న ఎంతకైనా దిగజారిపోతాడు. ఏ విమర్శైనా చేస్తాడు. జాతీయ, అంతర్జాతీయ మీడియా సైతం కరోనా విషయంలో అత్యంత పారదర్శకంగా జగన్ గారు వ్యవహరిస్తున్నారంటూ ప్రశంసల జల్లు కురిపిస్తోంది. కళ్లు కాకులెత్తుకెళ్లాయా అయ్యన్నా... ఒకసారి ప్రభుత్వం రోజూ విడుదల చేసే కరోనా కేసుల రిపోర్టు చూడు తెలుస్తుంది. మొదటిసారి మోదీ ప్రధానయ్యినప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రానికి దాదాపు 33 వేల కోట్ల రూపాయలు రోడ్ల నిర్మాణం కోసం కేటాయిస్తే... వచ్చిన డబ్బును ఎలా వినియోగించుకోవాలని ఆలోచించక... రోడ్డు కాంట్రాక్టుల కోసం బజారుకెక్కి పరువు తీయించుకున్న నేత అయ్యన్న పాత్రుడు. ఏజెన్సీ ముఖద్వారం నర్సీపట్నంలో సరైన రోడ్లు వేయించావా ?' అని ప్రశ్నించారు.

  YS Jagan కుమార్తె Harsha Reddy ఘనత, Bengaluru వెళ్తున్న జగన్ దంపతులు
  చంద్రబాబు ఆశీస్సులతోనే.. విశాఖలో అల్లుడి భూ గిల్లుడు

  చంద్రబాబు ఆశీస్సులతోనే.. విశాఖలో అల్లుడి భూ గిల్లుడు

  ‘ విశాఖ జిల్లాలో ఒక మాజీ మంత్రి అల్లుడి భూ గిల్లుడుకు జనం బెంబేలెత్తిపోయారు. పద్మనాభం మండలంలో వంద ఎకరాలకు పైగా భూముల్ని లాక్కున్నాడు. దాదాపు 450 ఎకరాల నీలయం సత్రం భూములను 16 వందల మంది రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ పేరుతో కారుచవకగా కొట్టేశాడు.

  - ఆ మాజీ మంత్రి వర్యుల భూ దందాపై అప్పటి మంత్రి అయ్యన్న పాత్రుడు, విష్ణుకుమార్ రాజే ... చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. బహిరంగంగా మీడియాతో మొరపెట్టుకున్నారు. సిట్ కు ఫిర్యాదులూ చేశారు. అయినా ఆయనపపై చర్యల్లేవు... మళ్లీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారంటే ... ఈ భూకుంభ కోణాల్లో చంద్రబాబు ఆశీస్సులుండబట్టే కదా?

  ( ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖలో టీడీపీ బరితెగింపుపై ఇంకా ఉంది ...)

  #VSRSpeaks' అంటూ విజయసాయి సోషల్ మీడియా వేదికగా ఏకిపారేశారు.

  English summary
  vijayasai reddy hits out at chandrababu and ayyannapatrudu.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X