175/175: సాయిరెడ్డి పీఆర్పీ లక్ష్యం ఇదే- సీఎం విజయ్ స్ఫూర్తి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు వీ విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. కొద్దిసేపటి కిందటే ఈ పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. దీని పేరు.. పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్పీ). జనం కోసం, జన హితం కోసం, దేశం కోసం, ధర్మం కోసం.. అనేది ప్రధానంగా ఇందులో ప్రతిబింబిస్తోంది. ఈ పార్టీ జెండాను కూడా ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ఆవిష్కరించారు. విజయవాడలో ఓ హోటల్ లో ఈ కార్యక్రమం ఏర్పాటైంది.

ఈ సందర్భంగా టీడీపీ కూటమి ప్రభుత్వం విమర్శలు చేశారు విజయసాయిరెడ్డి. రాష్ట్రంలో అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయని, అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. గ్రాఫిక్సులకు మాత్రమే అభివృద్ధి పరిమితమైందని అన్నారు. అభివృద్ధి కంటే ప్రతిపక్ష నేతల అరెస్టులకే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఇలా మాయ చేయడానికి 1990ల నాటి వెన్నుపోటు కాలం కాదని సాయిరెడ్డి ధ్వజమెత్తారు.

Vijayasai Reddy made Key remarks on TDP and Praised CM Vijay led TVK Government in Tamil Nadu

డబ్బు, అధికారం, మందు, మంద బలాన్ని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నమ్ముకుంటే టీడీపీ పాతాళానికి పడిపోవడానికి ఎక్కువ సమయం పట్టదని అన్నారు. రాష్ట్రంలో 99 పైసలు ఎకరం భూములు అమ్ముకుంటోన్నారని, అదే సమయంలో కిలో బియ్యం రూ. 100కు చేరిందని సాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబుకు గానీ, జగన్ కు నాయకత్వ లక్షణాలు ఏ మాత్రం లేవని, ఇప్పుడు ఏపీకి ఇదే పెద్ద లోటుగా పరిణమించిందని అన్నారు. ఇద్దరూ గోబెల్స్ ప్రచారం చేసుకునే వాళ్లేనని ఎద్దేవా చేశారు.

11 సీట్లకు పడిపోయారు: వైసీపీ ఓటమికి కారణం ఇదే- మాతో కలవండి
11 సీట్లకు పడిపోయారు: వైసీపీ ఓటమికి కారణం ఇదే- మాతో కలవండి

వైసీపీకి గానీ, టీడీపీకి గానీ తాము బీ టీమ్ గా గానీ, ఏ పార్టీకీ అమ్ముడుపోయేది గానీ కాదని ఆయన తేల్చి చెప్పారు. గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు బలమైన క్యాడర్ ను నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. 2029 ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ స్థానాలకు 175 మంది అభ్యర్థులను నిలబెడతామని సాయిరెడ్డి స్పష్టం చేశారు. సామాజిక న్యాయం అనే లక్ష్యంతో పరివర్తన రాజనీతి పార్టీ ముందుకు సాగుతుందని అన్నారు. బీసీల విషయంలో తెలంగాణలోనూ పోరాడతామని, ప్రాంతీయ భేదాలు తమకు ఉండవని చెప్పారు.

విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పేరు ఇదే: జెండా సైతం ఆవిష్కరణ
విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పేరు ఇదే: జెండా సైతం ఆవిష్కరణ

రైతు, మహిళ, ఉద్యోగులు, యువత పక్షపాతిగా తమ పార్టీ నడిపిస్తామని, ఇందులో ఎలాంటి రాజీపడే ప్రసక్తే లేదని సాయిరెడ్డి చెప్పారు. మహిళలకు సంపూర్ణ భద్రత కల్పిస్తామని, రాప్తాడు తరహా ఉదంతాలు జరిగితే నిందితుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. తమ మేనిఫెస్టో కాగితాలకే పరిమతం అయ్యేది కాదని, సమాజంలో చిట్టచివరి వ్యక్తికీ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు.

తమిళనాడులో పార్టీ పెట్టిన రెండేళ్లల్లో టీవీకే అధికారంలోకి వచ్చిందని, ఏపీలో ఇది ఎందుకు సాధ్యపడదని అన్నారు. అన్నాదురై కాలం నుంచి నిన్న, మొన్నటి వరకు అక్కడ ద్రవిడ పార్టీల కాలం నడిచిందని, డీఎంకే, అన్నా డీఎంకేలకు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు విజయ్ రూపంలో మూడో ప్రత్యామ్నాయం ఏర్పడిందని సాయిరెడ్డి గుర్తు చేశారు. ఈ రెండింటికీ సవాల్ విసిరే స్థాయికి టీవీకే చేరుకుందని, అలాంటి పరిస్థితులే ఏపీలో ఏర్పడతాయని ధీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+