సాయిరెడ్డి కొత్త పార్టీలో సీఎంగా ఎవరంటే..? యూత్ కే 66 శాతం సీట్లు-అందరికీ ఫ్రీ పవర్..!

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఇవాళ తాను త్వరలో పెట్టే కొత్త పార్టీకి సంబంధించి కీలక వివరాలు వెల్లడించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే సీఎంగా ఎవరుంటారనే అంశంతో పాటు పార్టీ ఐదు పాయింట్ల అజెండాను కూడా ఆయన ప్రకటించారు. ఈ ఐదు అంశాల్లో నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం, పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు, సోలార్ ద్వారా ప్రతీ ఇంటికీ, పొలానికీ ఉచిత విద్యుత్, లోన్ యాప్ లకు చెక్, అధిక ధరల నియంత్రణ, 40 ఏళ్ల లోపు యువతకు 66 శాతం సీట్లు, పదవులు ఉన్నాయి

Vijayasai Reddy: కొత్త రాజకీయ పార్టీపై విజయసాయిరెడ్డి ప్రకటన..!
Vijayasai Reddy: కొత్త రాజకీయ పార్టీపై విజయసాయిరెడ్డి ప్రకటన..!

తాను పెట్టే కొత్త పార్టీలో సీఎం అభ్యర్ధిగా తాను ఉండబోవడం లేదని విజయసాయిరెడ్డి వెల్లడించారు. మహారాష్ట్రలో బాల్ ధాక్రే తరహాలో తన పార్టీకి మెంటార్ గా మాత్రమే ఉంటానన్నారు. అలాగే తన ఐదు పాయింట్లలో 80 శాతం ప్రజలకు ఖర్చు కంటే ఆదాయం తక్కువగా ఉన్నందున, దాన్ని ఎలా పెంచాలన్నది, అప్పుల ఊబి నుంచి ఎలా బయటపడాలో చెప్తామన్నారు. రెండో అంశం భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు ఎలా తగ్గించాలో చెప్తామన్నారు. అమరావతిని వ్యతిరేకించనని, ఇది ఇష్టమున్నా లేకున్నా వ్యతిరేకించి ప్రయోజనం లేదని జగన్ మావిగన్ ప్రతిపాదనపై వ్యాఖ్యానించారు. ప్రైవేటు కంపెనీల్ని ఆహ్వానించాలని, పెట్టుబడులు తీసుకురావాలని, ప్రభుత్వ డబ్బుల్ని మాత్రం అమరావతికి దుర్వినియోగం చేయొద్దన్నారు.

Vijayasai Reddy Rules Out CM Ambitions as He Unveils Five-Point Agenda for New Party
ఆమెను టచ్ చేస్తే..? అసెంబ్లీ సాక్షిగా విజయ్ బిగ్ వార్నింగ్..!
ఆమెను టచ్ చేస్తే..? అసెంబ్లీ సాక్షిగా విజయ్ బిగ్ వార్నింగ్..!

ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా, కేంద్ర ఇచ్చే సబ్సిడీతో పాటు రాష్ట్రం కూడా సబ్సిడీ ఇచ్చి సోలార్ ప్యానెల్స్ ఇస్తే పొలాలు, ఇళ్లకు ఉచిత విద్యుత్ ఇవ్వొచ్చని సాయిరెడ్డి తెలిపారు. పరిశ్రమలకు మాత్రం రాకపోవచ్చన్నారు. ఈ దిశగా తమ పార్టీ ప్రతీ కుటుంబానికీ, ప్రతీ రైతుకూ ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. ప్రజలే ప్రభుత్వానికి కరెంటు అమ్మే పరిస్ధితి తీసుకొస్తామన్నారు. పెట్రో ఉత్పత్తులపై ఏపీ-తెలంగాణలో 31 శాతం వ్యాట్ విధిస్తున్నారన్నారు. దీనికి అదనంగా 4 రూపాయల సెస్ కూడా విధిస్తున్నారన్నారు. రాష్ట్రం ఆదాయం కోల్పోయినా ఫర్వాలేదు, దీన్ని 15 శాతానికి తగ్గిస్తామన్నారు. తద్వారా ప్రజల ఆదాయం పెంచి, ఖర్చులు తగ్గిస్తామన్నారు. అలాగే రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టి నీటి నిల్వ సామర్ధ్యం పెంచి ఉంటే ఎల్ నినో ప్రభావంతో పంటలు నష్టపోవాల్సిన పరిస్ధితి వచ్చేది కాదన్నారు. అందుకే తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వెయ్యి టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యాన్ని మూడింతలు పెంచుతామన్నారు.

Vijayasai Reddy Rules Out CM Ambitions as He Unveils Five-Point Agenda for New Party
Union Cabinet: కేంద్ర కేబినెట్లో తిరుగుబాటు ? రాజీనామాకు నిరాకరిస్తున్న ఏడుగురు మంత్రులు ?
Union Cabinet: కేంద్ర కేబినెట్లో తిరుగుబాటు ? రాజీనామాకు నిరాకరిస్తున్న ఏడుగురు మంత్రులు ?

తమ పార్టీ అధికారంలోకి వస్తే విద్యార్ధులు, టీచర్లపై భారం తగ్గిస్తామని, గ్రాడ్యుయేట్ బ్రిడ్జి అలవెన్స్ పేరుతో కొంత మొత్తం ఇస్తామని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేస్తామని, ప్రశ్నాపత్రాలు కేవలం నారాయణ, చైతన్య కాలేజీలకు లీక్ కాకుండా చూస్తామన్నారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం, సోలార్ విద్యుత్, పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు, ప్రతీ ఇంటికీ, పొలానికీ ఉచిత విద్యుత్, లోన్ యాప్ లకు చెక్, అధిక ధరల నియంత్రణ, 40 ఏళ్ల లోపు యువతకు 66 శాతం సీట్లు, పదవులు కేటాయించడం, మిగతా 34 శాతం సీనియర్లు, సమర్ధులకు ఇస్తామన్నారు. యువతే తమ పార్టీకి ప్రాణం అన్నారు. ఏపీపీఎస్సీ, డీఎస్సీ స్కాంలపై వాస్తవాలు తేలాలంటే సీబీఐ దర్యాప్తుకు అప్పగించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+