Union Cabinet: కేంద్ర కేబినెట్లో తిరుగుబాటు ? రాజీనామాకు నిరాకరిస్తున్న ఏడుగురు మంత్రులు ?
ఢిల్లీలో విద్యార్ధుల నిరసనల తర్వాత దేశంలో రాజకీయాలు వేగంగా మారుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. అదే సమయంలో ఢిల్లీ నిరసనలకు ముందే కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు ప్రయత్నాలు ప్రారంభించిన ప్రధాని మోడీ.. ఆ తర్వాత పార్లమెంట్ సమావేశాలపై దీని ప్రభావం పడుతుందని భావించి వెనక్కి తగ్గారు. ఆ తర్వాత కూడా కేబినెట్ ప్రక్షాళనకు వీలుగా ముందుగా బీజేపీ జాతీయ కార్యవర్గంలో మార్పులు చేశారు. రాజ్యసభ పదవీకాలం ముగిసిన కేంద్రమంత్రులకు పొడిగింపు కూడా ఇవ్వకుండా సాగనంపారు. అయినా కేబినెట్ ప్రక్షాళనపై ముందడుగు పడకపోవడం వెనుక కీలక కారణాలున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర కేబినెట్ ప్రక్షాళన (Union Cabinet Reshuffle) కోసం ఇప్పటికే ప్రధాని మోడీ, అమిత్ షా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయినా ఈ ప్రక్రియ ముందుకు సాగకపోవడం వెనుక మంత్రుల తిరుగుబాటే కారణంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆరోపిస్తోంది. బీజేపీలోని పలువురు మంచి మనసున్న వ్యక్తులు పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఈడీ, ఐటీ, సీబీఐల బెదిరింపుల కారణంగా పార్టీని వీడలేకపోతున్నారని తాము ఇదివరకే చెప్పినట్లు కాక్రోచ్ జనతా పార్టీ జాతీయ సహ కన్వీనర్ సౌరవ్ దాస్ వెల్లడించారు.

We had already said that several well-meaning persons in the BJP are extremely unhappy with the party and can’t even leave the party due to ED, IT, CBI threat.
— Saurav Das (@SauravDassss) September 5, 2026
Now high-level friends in the establishment are telling us that there is an OPEN REBELLION within the Union Cabinet.…
ఇప్పుడు వ్యవస్థలోని ఉన్నత స్థాయి మిత్రులు కేంద్ర మంత్రివర్గంలో బహిరంగ తిరుగుబాటు జరుగుతోందని తమకు చెబుతున్నారని సౌరవ్ దాస్ సంచలన ట్వీట్ చేశారు. ఏడుగురు మంత్రులు రాజీనామా చేయడానికి నిరాకరించినట్లు తెలుస్తోందని ఆయన వెల్లడించారు. తమకు నిష్కళంకమైన రికార్డు ఉన్నప్పటికీ, ఫిరాయింపుదారులకు చోటు కల్పించడం కోసం రాజీనామా చేయమని అడుగుతున్నారని వారు అంటున్నారన్నారు. అందుకే ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగడం లేదని చెబుతున్నారని సౌరవ్ తెలిపారు. ఆ తర్వాత జంతర్ మంతర్ నిరసన సాధించింది ఏమిటని తమను అడుగుతున్నారని బీజేపీ నేతల్ని ఎద్దేవా చేశారు.














Click it and Unblock the Notifications
