కేబినెట్ లోకి విజయశాంతి, కోదండరాం - ఔట్..ఇన్, కొత్త పీసీసీ చీఫ్ ఫిక్స్..ముహర్తం..!!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొండా సురేఖ బర్తరఫ్ తో కేబినెట్ ప్రక్షాళన కు రంగం సిద్దం అవుతోంది. ఈ మేరకు ముహూర్తం దాదాపు ఖరారైంది. ఢిల్లీ లో జరిగిన చర్చల వేళ.. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. మంత్రివర్గంలోకి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో పాటుగా విజయశాంతి, కోదండ రాం కు అవకాశం ఖాయమని తెలుస్తోంది. కాగా.. కొత్త టీపీసీసీ గా కొత్త నేత పేరు దాదాపు ఖరారైంది.

తెలంగాణ మంత్రివర్గ ప్రక్షాళన ఈ నెల మూడో వారంలో జరగనుంది. ఈ మేరకు తాజాగా ఢిల్లీలో జరిగిన చర్చల్లో నిర్ణయం తీసుకున్నారు. మంత్రి వర్గంలో మూడు ఖాళీలను భర్తీ చేయడంతో పాటు శాఖల్లో మార్పులు-చేర్పులు చేపట్టనున్నారు. ఈ సారి టీపీసీసీ అధక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడిగా ఆయన రెండేళ్ల పదవీ కాలం ఈ నెల 15తో ముగియనుంది. పీసీసీ అధ్యక్ష పదవికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేరు పరిశీలనలో ఉంది. ఒకవేళ లంబాడా వర్గానికి అవకాశం ఇవ్వాలని భావిస్తే మహబూబాబాద్‌ ఎంపీ బలరాం నాయక్‌కూ అవకాశం దక్కొచ్చు. శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ను మంత్రివర్గం లోకి తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. రేసులో సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. మంత్రి వర్గం రేసులో ఎమ్మెల్సీ విజయశాంతి పేరూ పరిశీలనలో ఉంది.

మాజీ సీఎం కు తెలంగాణ బాధ్యతలు- రాహుల్ ఆకస్మిక నిర్ణయం వెనుక, ఇక నుంచి..!!
మాజీ సీఎం కు తెలంగాణ బాధ్యతలు- రాహుల్ ఆకస్మిక నిర్ణయం వెనుక, ఇక నుంచి..!!
aicc-approves-cabinet-reshuffle-in-telangana-with-placement-of-kodanda-ram-and-vijaya-santhi-here

ఢిల్లీ స్పెషల్ ఫోకస్.. కీలక నిర్ణయాలు

కొండా సురేఖ స్థానంలో బీసీ వర్గానికి చెందిన మహిళకు అవకాశం ఇవ్వాలంటే విజయశాంతికి పదవి ఇవ్వాలని భావిస్తోంది. మహిళా కోటాలో నలమాద పద్మావతీరెడ్డి కూడా మంత్రివర్గంలో స్థానం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక, లంబాడా వ్యక్తికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని భావిస్తే విప్‌ రామచంద్రనాయక్‌, ప్యానల్‌ స్పీకర్‌ బాలునాయక్‌లో ఒకరికి అవకాశం దక్కొచ్చు. ఒకవేళ పీసీసీ చీఫ్‌గా బలరాం నాయక్‌కు అవకాశం వస్తే మంత్రివర్గంలో ఆ వర్గానికి అవకాశం ఉండక పోవచ్చు. మరోవైపు, మంత్రివర్గం నుంచి ఒకరిని తొలగించే అవకాశాలూ ఉన్నాయన్న సమాచారంతో ఆ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు, ముగ్గురు ఇప్పటికే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ తదితరులు సైతం తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో.. కేబినెట్ ప్రక్షాళన వేళ.. ఎవరికి ఛాన్స్ దక్కుతుంది.. ఎవరిని తప్పిస్తారనేది ఉత్కంఠగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+