‘ది ప్యారడైజ్’ రికార్డు వసూళ్లు.. నాని రియాక్షన్ వైరల్!
నేచురల్ స్టార్ నాని హీరోగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి మొదటిరోజే సంచలన వసూళ్లతో అదరగొట్టింది. నాని కెరీర్లోనే రికార్డు స్థాయి ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.88 కోట్లకు పైగా గ్రాస్, ఓవర్సీస్‌లో ప్రీమియర్స్‌తో కలిపి 2.25 మిలియన్ డాలర్ల మార్కును దాటి కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ అద్భుతమైన స్పందనపై నాని సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అభిమానులకు, ప్రేక్షకులకు తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
నాని సోషల్ మీడియా వేదకగా స్పందిస్తూ.. "ప్రేక్షకుల నుంచి వస్తున్న అన్ని రివ్యూలు, కామెంట్స్ నేను చూశాను. మీరు నాపై చూపిస్తున్న విపరీతమైన ప్రేమతో పాటు నెట్టింట వస్తున్న సరదా ట్రోల్స్ ను కూడా సమానంగా ఆస్వాదిస్తున్నాను. ఈ సినిమాను ప్రేక్షకులు తమ సొంత చిత్రంగా భావించి గుండెల్లో పెట్టుకున్న తీరు నన్ను ఎంతో భావోద్వేగానికి గురిచేసిందియ అదే సమయంలో సమీక్షకులు, విమర్శకులు వేలెత్తి చూపిన లోపాల నుంచి కూడా నేర్చుకోవాల్సిన విషయాలను గ్రహించాను" అని నాని పేర్కొన్నారు.

అలాగే సినిమా కోసం పడ్డ శ్రమను గుర్తుచేసుకుంటూ.. "మీకు ఓ వినూత్నమైన, సరికొత్త అనుభూతిని అందించడానికి మేము ఎంతో రక్తం, చెమట చిందించి 'ది ప్యారడైజ్' సినిమాను నిర్మించాం. దీనిని వేడుకగా జరుపుకోవడం లేదా విశ్లేషించడం అనేది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. నాపై మీరు చూపిస్తున్న అభిమానానికి, ఈ చిత్రంపై ఉన్న ఉత్సాహానికి నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పడం తప్ప నేను ఏమీ అనలేను" అని నాని స్పందించారు.
'దసరా' వంటి భారీ హిట్ తర్వాత డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నాని కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా కావడం, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించడంతో విడుదలకు ముందే ఈ సినిమాపై ఆకాశన్నంటే అంచనాలు ఏర్పడ్డాయి. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ భారీ సినిమా రెండో రోజు కూడా హౌస్‌ఫుల్ బుకింగ్స్‌తో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.
I have seen all your reactions and responses. I’ve received all your love and equally enjoyed your hilarious trolls. I’m heartwarmed by the way audience have owned the film, and also learnt from the flaws that critics and reviewers have pointed out.
— Nani (@NameisNani) September 25, 2026
Thank you for everything is…













Click it and Unblock the Notifications
