కుంభ రాశి, మీన రాశి 2026 అక్టోబరు నెల సమగ్ర జాతక ఫలం
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని అద్భుత యోగాలను ఏర్పరుస్తుంటాయి. వీటివల్ల కొన్ని రాశులకు సానుకూల ఫలితాలు, మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కలుగుతుంటాయి. అక్టోబరు నెలకు సంబంధించి కుంభ రాశి, మీన రాశి జాతక ఫలం ఎలా ఉందనే వివరాలను తెలుసుకుందాం.
కుంభ రాశి (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు)
కుంభ రాశి వారికి 2026 అక్టోబరు నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. గ్రహాల అనుకూలత వల్ల ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మరింత అనుకూలంగా ఉంటుంది.ఉద్యోగస్తులకు పనిభారం పెరిగినప్పటికీ, మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగులు లేదా అధికారులతో మాట్లాడేటప్పుడు ఓర్పు వహించడం మంచిది.నెల ద్వితీయార్థంలో ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐటీ, సేవారంగంలో ఉన్నవారికి మంచి పురోగతి ఉంటుంది. ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ, అనుకోని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులకు ఇది సగటు సమయం.

పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వడం లేదా తీసుకోవడం చేయకపోవడం మంచిది. పాత బకాయిలు కొద్దిగా వసూలవుతాయి. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చినా సమయానుకూలంగా సమసిపోతాయి. భాగస్వామితో సమయం గడపడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఆరోగ్య పరంగా నరాల బలహీనత, నిద్రలేమి లేదా కాళ్ల నొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు. సరైన విశ్రాంతి, వ్యాయామం అవసరం. శనివారం రోజు శని దేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం లేదా ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించి హనుమాన్ చాలీసా పఠించడం శుభఫలితాలను ఇస్తుంది.
మీన రాశి (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
మీన రాశి వారికి అక్టోబరు నెల చాలా అనుకూలంగా ఉంటుంది. పట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ధన యోగం, ఆధ్యాత్మిక చింతన పెరుగుతాయి.ఉద్యోగార్థులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి సానుకూల వార్తలు అందుతాయి. కార్యాలయంలో మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. అధికారుల మద్దతు పూర్తిస్థాయిలో ఉంటుంది. సృజనాత్మక రంగంలో ఉన్నవారికి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక స్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. నూతన ఆదాయ మార్గాలు సుగమమవుతాయి.
వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు అందుతాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. ఇంట్లో శుభకార్యాలు లేదా దైవ కార్యక్రమాలు నిర్వహించే సూచనలు ఉన్నాయి. సంతాన సంబంధిత పురోగతి ఆనందాన్ని ఇస్తుంది. ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. అయితే, ఆహార నియమాలు పాటిస్తూ పొట్ట సంబంధిత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. గురువారం రోజు దక్షిణామూర్తి లేదా రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోవడం, శనగలు దానం చేయడం వల్ల మరింత శ్రేయస్సు కలుగుతుంది.














Click it and Unblock the Notifications
