భారత్ ను చూసి నేర్చుకోండి- పాకిస్తాన్ కు మాజీ ఆల్ రౌండర్ హితవు
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనుసరిస్తున్న తప్పుడు విధానాలపై ఆ దేశ మాజీ టెస్టు కెప్టెన్ మిస్బా ఉల్ హక్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న జట్టు నుంచి ఏడుమంది ప్లేయర్లు, ఇద్దరు కోచ్‌లను ఆకస్మికంగా స్వదేశానికి రప్పించాలన్న బోర్డు నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఈ అనూహ్య పరిణామాల నేపథ్యంలోనే ఆయన సెలెక్టర్ పదవికి సైతం రాజీనామా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
సెలెక్షన్ కమిటీ సభ్యులందరికీ పీసీబీ షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై మిస్బా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రతికూల పరిస్థితులలో కూడా హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌ను బాధ్యతల నుంచి తప్పించడం సరికాదని అన్నారు. ఓటమి ఎదురైన ప్రతిసారీ వ్యవస్థలో లోపాలను సరిదిద్దకుండా తాత్కాలిక మార్పులకే బోర్డు ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు.

విదేశాల నుంచి వచ్చే కోచ్‌లకు బోర్డు అపరిమితమైన అధికారాలను ఇస్తోందని, ఒకవేళ జట్టు విఫలమైనా వారిపై ఎలాంటి బాధ్యతను మోపట్లేదని మండిపడ్డారు. అదే సమయంలో సొంత కోచ్‌లకు మాత్రం కనీస మద్దతు ఇవ్వట్లేదని, ప్రతి చిన్న దానికి వారిని బోనులో నిలబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను విదేశీ కోచ్‌ల నియామకాన్ని తప్పుబట్టట్లేదని, విదేశీ కోచ్‌ల పట్ల కొంత సాఫ్ట్ కార్నర్ ఉంటోందని వ్యాఖ్యానించారు. అదే స్థానిక కోచ్‌ల విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ వారిని విమర్శించడమే పనిగా పెట్టుకుంటారని చెప్పారు.
ఈ సందర్భంగా భారత క్రికెట్ బోర్డు అనుసరిస్తోన్న విధానాలను మిస్బా ఉదహరించారు. భారత జట్టు ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అగ్రస్థానంలో కొనసాగడం వెనుక దశాబ్దాల కఠోర శ్రమ ఉందని అన్నారు. 1990ల నుంచి భారత్ తమ క్రికెట్ నిర్మాణంపై దృష్టి పెడుతూ వచ్చిందని, దాని ఫలితాల వల్లే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి గొప్ప ఆటగాళ్లు పుట్టుకొచ్చారని గుర్తుచేశారు.
పాకిస్తాన్ క్రికెట్‌లో ప్రస్తుతం యువ ఆటగాళ్లకు టెస్ట్ క్రికెట్ ఆడే అవకాశం చాలా తక్కువగా లభిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నేటి తరం ఆటగాళ్లు ఎక్కువగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కే ప్రాధాన్యత ఇస్తోన్నారని, దీనివల్ల టెస్ట్ ఫార్మట్ లో రాణించే నైపుణ్యాలు కొరవడుతున్నాయని విశ్లేషించారు. ఒత్తిడిని తట్టుకోలేకపోవడానికి ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడకపోవడమే కారణమని చెప్పారు.
పాకిస్తాన్ క్రికెట్ పూర్వవైభవాన్ని సంతరించుకోవాలంటే పీసీబీ తన విధానాలను మార్చుకోవాల్సి ఉంటుందని మిస్బా సూచించారు. ఆకస్మిక మార్పులతో ఆటగాళ్లలో భయాందోళనలు పెరుగుతాయే ఒరిగేదేమీ ఉండదని, యువ ఆటగాళ్లకు ఎక్కువ టెస్టు మ్యాచ్‌లు ఆడేలా ప్రోత్సహించాలని చెప్పారు.













Click it and Unblock the Notifications
