ఇంత ఆత్మవంచన అవసరమా పురందేశ్వరి గారూ.. చిన్నమ్మే టార్గెట్ గా సాయిరెడ్డి!!
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల కాలంలో పురందేశ్వరిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకప్పుడు చంద్రబాబును, లోకేష్ ను టార్గెట్ చేసి నిత్యం తనదైన శైలిలో సెటైర్లు వేసిన విజయసాయిరెడ్డి ఇటీవల కాలంలో చిన్నమ్మను తెగ ఫోకస్ చేస్తున్నారు. జైల్లో ఉన్న చంద్రబాబు కోసం పురందేశ్వరి ఢిల్లీలో లోకేష్ తో కలిసి అమిత్ షాను కలవడంతో ఆమెపై మాటలదాడి పెంచిన సాయిరెడ్డి సోషల్ మీడియాలో నిత్యం ఆమెపై పోస్టులు పెడుతున్నారు.
పురందేశ్వరి సుప్రీంకోర్టు సీజేఐ కి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని లేఖ రాశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని పేర్కొన్న ఆమె, పదేళ్లుగా బెయిల్ పై కొనసాగుతూ, సిబిఐ, ఈడీ కేసుల విషయంలో విజయసాయి షరతులు ఉల్లంఘిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

ఇక అప్పటినుంచి మరింత తీవ్ర విమర్శలు చేస్తున్న విజయసాయిరెడ్డి తాజాగా మరోమారు ఎక్స్ వేదికగా పురందేశ్వరిపై విమర్శల వర్షం కురిపించారు. ఎవరికి బెయిల్ వచ్చినా సంతోషిస్తారు చిన్నమ్మా! కానీ కొందరి బెయిల్ మాత్రమే రద్దు చెయ్యమంటారు అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి, ఇంత ఆత్మవంచన అవసరమా పురందేశ్వరి గారూ? అని ప్రశ్నించారు.
తను దోచుకున్న దాంట్లో వాటా ఇచ్చే బావ గారికి బెయిల్ వచ్చిందని ఆనందంలో తేలిపోతున్నారు అని ఆరోపించారు. అయ్యో! అలాంటిది ఏమీ లేదంటే...సుప్రీంకోర్టు CJI గారికి లేఖ రాయండి బావ చంద్రబాబుకు బెయిల్ రద్దు చేయమని అంటూ టార్గెట్ చేశారు. అంతకుముందు పురందేశ్వరి గారి తాపత్రయమంతా బావ గారి మేలు కోసమే అని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి.
అమూల్ డెయిరీకి ఆస్తులెలా అప్పగిస్తారు అని ప్రశ్నిస్తారన్నారు. అమూల్ వచ్చాకే పాలు లీటరు ధర వెన్న శాతాన్ని బట్టి రూ.10-20 వరకు పెరిగిందని, పాడి రైతులకు 33 నెలల్లో రూ.2,604 కోట్ల అదనపు లబ్ధి చేకూరిందని పేర్కొన్న ఆయన, పురందేశ్వరికి ఇవన్నీ పట్టవన్నారు. హెరిటేజ్ ఎక్కడ నష్టపోతుందో అని ఆందోళన చెందుతున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications