ఏపీని అలా చూడాలనుకుంటున్నా..! చంద్రబాబుకు సాయిరెడ్డి సలహా..!
గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో సైలెంట్ అయిపోయిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అప్పుడప్పుడూ తన ఉనికి చాటుకుంటూనే ఉన్నారు. తొలుత ఎంపీ పదవికి, వైసీపీకి రాజీనామా చేసేసి, రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సాయిరెడ్డి.. వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. కానీ కొంతకాలంగా ఆయన వివిధ అంశాలపై ఎక్స్ లో ట్వీట్లు పెడుతూనే ఉన్నారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలు సూచనలు చేస్తున్నారు.
ఇదే క్రమంలో తాజాగా వైజాగ్ లో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సీఐఐ పెట్టుబడుల సదస్సుకు సంబంధించి విజయసాయిరెడ్డి ఇవాళ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన సీఎం చంద్రబాబుకు ఓ కీలక సలహా కూడా ఇచ్చారు. పెట్టుబడుల సదస్సు ద్వారా వచ్చిన ప్రతిపాదనల్ని గ్రౌండ్ చేసే విషయంలో సాయిరెడ్డి ఈ సలహా ఇచ్చారు. అంతే కాదు మన రాష్ట్రాన్ని తాను ఎలా చూడాలనుంటున్నదీ ఇందులో వైసీపీ మాజీ ఎంపీ వివరించారు.

1/2. AP Govt. signed 613 MoUs worth ₹13.25 lakh crore in the CII Summit. A special officer needs to be appointed to follow up these MoUs and ensure that these projects are actually grounded. A website for real-time grounding needs to be set up for transparency. Only then can the…
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 18, 2025
సాయిరెడ్డి తన ట్వీట్ లో .. "సీఐఐ పెట్టుబడుదల సదస్సులో ఏపీ ప్రభుత్వం ₹13.25 లక్షల కోట్ల విలువైన 613 ఒప్పందాపై సంతకం చేసిందన్నారు. ఈ ఒప్పందాలను అమలు చేయడానికి, అలాగే ఈ ప్రాజెక్టులు వాస్తవంగా గ్రౌండింగ్ అయ్యాయని నిర్ధారించుకోవడానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాల్సిన అవసరం ఉందని ఆయన సీఎం చంద్రబాబుకు తెలిపారు. పారదర్శకత కోసం రియల్-టైమ్ గ్రౌండింగ్ కోసం ఒక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయాలన్నారు.

అప్పుడే ఇలాంటి ఈవెంట్‌ల ఉపయోగంపై సందేహాలను తొలగించవచ్చని సీఎం చంద్రబాబుకు విజయసాయిరెడ్డి సూచించారు. అలాగే సీఐఐ సదస్సులో చేసుకున్న ఒప్పందాల వల్ల 75% లేదా ₹10 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు గ్రౌండింగ్ అయినా, ఏపీ భారీగా రూపాంతరం చెందుతుందన్నారు. తదుపరి తరానికి భవిష్యత్తులో సిద్ధంగా ఉన్న ఏపీని చూడాలని కోరుకుంటున్నట్లు సాయిరెడ్డి తెలిపారు.
-
జగన్ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్ కలకలం-హైకోర్టుకు వైసీపీ-డీజీపీకి ఘాటు లేఖ..! -
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ కేంద్రాల ప్రారంభం-దేశంలోనే తొలిసారి..! -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
చంద్రబాబుకు జాతీయ పార్టీ నేత సవాల్: మణిపూర్ లా తయారవుతాయి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications