ఇచ్చిన మాటకు కట్టుబడాలి: కెసిఆర్‌పై విజయశాంతి

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి పరోక్ష విమర్శలు చేశారు. నాయకుడంటే ఇచ్చిన మాటకు కట్టుబడాలని ఆమె అన్నారు. కాంగ్రెసులో తెరాస విలీనంపై కెసిఆర్ తీరుపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆమె ఆ విధంగా స్పందించారు. నాయకుడంటే గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని, అప్పుడే ప్రజలు నమ్ముతారని ఆమె అన్నారు. కొంత మంది నాయకులు మాట నిలబెట్టుకోలేకపోతున్నారని ఆమె అన్నారు.

సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెసు పార్టీలో చేరిన తర్వాత విజయశాంతి దిగ్విజయ్ సింగ్‌తో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వాస్తవరూపం ధరించడంతో విజయశాంతి కాంగ్రెసు పార్టీలో చేరడానికి ముందుకు వచ్చారని, విజయశాంతి పార్టీలో చేరారని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. సోనియా గాంధీ కాంగ్రెసు కండువా కప్పి విజయశాంతిని పార్టీలోకి ఆహ్వానించారు.

Vijayashanthi criticises KCR on merger politics

తెలంగాణ ప్రజల కల సాకారం కావడంతో తాను కాంగ్రెసులో చేరుతానని చెప్పానని, సోనియా ఆశీస్సులతో తాను కాంగ్రెసులో చేరానని విజయశాంతి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వస్తుందా, లేదా అనే సందేహం ఉంటూ వచ్చిందని, అది వాస్తరూపం ధరించిందని, ఈ ఘనత తెలంగాణ అమరవీరులకే దక్కాలని ఆమె అన్నారు. తెలంగాణ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు కాబట్టి తాను కాంగ్రెసులో చేరానని ఆమె చెప్పారు.

రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని తాను కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. రెండు రాష్ట్రాల ప్రజల ఆనందంగా ఉండాలని ఆమె అన్నారు. తెలంగాణలో వెనకబడిన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలని తాను కోరుకుంటున్నట్లు విజయశాంతి చెప్పారు. తెలంగాణ కోసం అందరం పనిచేశామని, చివరి దాకా నిలబడ్డామని అన్నారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననేది ముఖ్యం కాదని, పార్టీని బలోపేతం చేయడమే తన కర్తవ్యమని ఆమె అన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకుంటానని ఆమె చెప్పారు.

సోనియా సమక్షంలో పార్టీలో చేరడానికి ముందు విజయశాంతి కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌తో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఆ తర్వాత దిగ్విజయ్ సింగ్‌తో కలిసి సోనియా వద్దకు వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+