చిరంజీవిపై విజయశాంతి సెటైర్లు (వీడియో)
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 1990ల్లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారామె. అగ్ర హీరోలతో నటించి సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి సినిమా హిట్ అయ్యేది. అంతే కాకుండా ఈ జోడికి మోస్ట్ హిట్ పెయిర్‌గా మంచి గుర్తింపు వచ్చింది.ఇక బాలకృష్ణతో విజయశాంతి రిలేషన్ మెయిన్‌టైన్ చేశారనే రూమర్స్ కూడా తెర మీదకు వచ్చాయి. ఇక రాజకీయాల్లో కూడా విజయశాంతి తనదైన ముద్ర వేశారు.
ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో రాములమ్మగా కీర్తి గడించారు. తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టి తర్వాత ఆ పార్టీని అప్పటి టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ జాతీయ పార్టీల్లో పని చేశారామె. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. అయితే ఆమె కాంగ్రెస్‌లో పెద్ద యాక్టివ్‌గా కనిపించడం లేదు. ఇదిలా ఉంటే విజయశాంతి గతంలో మాట్లాడిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.ఆమె చిరంజీవి గురించి మాట్లాడటం జరిగింది. విజయశాంతి అప్పటి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న సమయంలో చిరంజీవిపై కామెంట్స్ చేశారు.

చిరంజీవి రాజకీయాల్లోకి రావడం, ప్రజా సమస్యలపై ఆయన పోరాటం చేయడానికి సంబంధించిన విజయశాంతి అప్పట్లో విమర్శలు చేసింది. దానిపై యాంకర్ ప్రశ్నించగా, ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు, ప్రజల తరఫున పోరాడలేనప్పుడు కచ్చితంగా వేలెత్తి చూపిస్తాం. ఆ స్థానంలో ఎవరు ఉన్నా తాను స్పందిస్తానని, వేలెత్తి చూపిస్తానని తెలిపింది విజయశాంతి. సినిమాలు, రాజకీయాలు వేరని విజయశాంతి వ్యాఖ్యానించారు.
తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై స్పందించాలని సినీ తారలను ఆమె డిమాండ్ చేశారు. వాళ్లు ఇచ్చే డబ్బులతోనే ఇంతటి పారితోషికాలు తీసుకుంటున్నారని తెలంగాణ రాష్ట్రం గురించి స్పందించాలని ఎవరూ ముందుకు రాలేదని, ఎవరూ స్పందించలేదని వాపోయింది.వాళ్లు స్వార్థంతోనే స్పందించలేదని చెప్పింది విజయశాంతి. ఇదే సమయంలో చిరంజీవిపై కూడా విజయశాంతి సెటైర్లు వేశారు.
పార్టీ పెట్టిన వెంటనే సీఎం అయిపోవాలంటే కుదురుతుందా. ఎన్టీఆర్‌లా అందరు అయిపోవాలంటే సాధ్యమవుతుందా?. రామారావుకి గట్స్ ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి అయ్యారు, ప్రజల కోసం పనిచేశారు. ఎంతో కష్టపడ్డారు. కానీ మీరు అన్ని సుఖాలకు అలవాటు పడి, ఓవర్‌నైట్‌లో సీఎం అవ్వాలంటే ఎలా సాధ్యం. ప్రజల కోసం కష్టపడాలి, డెడికేషన్, కమిట్‌మెంట్ ఉండాలంటూ విజయశాంత్ కామెంట్స్ చేశారు డబ్బు వచ్చేయాలి, చైర్‌లో కూర్చోవాలి అంటే అది స్వార్థం అవుతుందని, సేవ చేయలేనప్పుడు రాజకీయాల్లోకి రాకూడదని, హాయిగా సినిమాలు చేసుకోవాలని చెప్పింది విజయశాంతి. పరోక్షంగా ఆమె చిరంజీవిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని అప్పట్లో విజయశాంతిపై తీవ్ర విమర్శలొచ్చాయి.
-
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు రాని కథతో సినిమా..! -
తెలుగు నిర్మాతలను అపర కుబేరులుగా మార్చిన 4 డబ్బింగ్ సినిమాలు -
‘పుష్ప2’, ‘ధురంధర్’ సినిమాల్లో అసలైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
ఎవరీ మార్క్ కె రాబిన్.. ఎందుకు ఆయనకు అంత క్రేజ్ -
నరసింహ నాయుడు, ఘరానా మొగుడు.. ఈ రెండు ఇండస్ట్రీ హిట్లలో ఏది బెస్ట్? -
ఆ ఒక్క విషయంలో ఎన్టీఆర్‌నే బాలయ్య ఎదిరించారు: నారా బ్రాహ్మణి -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి..










Click it and Unblock the Notifications