వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రద్దుచేసిన నగదును మేం తీసుకొంటామంటూ ఆహ్వానం

By Narsimha
|
Google Oneindia TeluguNews

విజయవాడ : కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద నగడు నోట్లను తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అయితే వివజయవాడలో మాత్రం రద్దు చేసిన నగదు నోట్లతో కొనుగోలు చేసేందుకు వస్త్ర వ్యాపారులు ప్రజలకు ఆహ్వానాలు పలుకుతున్నారు.రద్దు చేసిన నగదు నోట్లను తీసుకొనేందుకు విజయవాడ వస్త్ర వ్యాపారులు ఆసక్తిని చూపుతుండంతో ప్రజలు షాపింగ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

పెద్ద నగదు నోట్లను తీసుకొనేందుకు వ్యాపారులు పెద్దగా ఆసక్తిచూపడం లేదు. కొన్ని చోట్ల ఈ నగదును తాము తీసుకోబోమని వాల్ పోస్టర్లు అంటిస్తున్నారు.అయితే ఈ తరహా ప్రచారానికి విరుద్దంగా విజయవాడలోని వస్త్ర వ్యాపారులు పెద్ద నగదు నోట్లను తాము తీసుకొనేందుకు రడీగా ఉన్నామని చెబుతున్నారు.తమ దుకాణాల్లో వస్త్రాలు కొనుగోలు చేసేందుకు పెద్ద నగదు నోట్లతోనే రావాలని వారు ప్రజలకు ఆహ్వానాలు పలుకుతున్నారు.

vijayawada cloth stores management bumper offer, banned currency we accept

తమ వద్ద ఉన్న రద్దు చేసిన నగదును వదిలించుకోవడానికి తమ ముందున్న మార్గాలను ఎంచుకొనేందుకు ప్రజలు ఆసక్తిని చూపుతున్నారు. అయితే విజయవాడలోని వస్త్రలత బజారు వ్యాపారులు తమ దుకాణాల్లో బట్టల కొనుగోలుకు పెద్ద నోట్లను తీసుకువస్తే అభ్యంతరం లేదని ప్రకటించారు.ఈ ప్రకటనతో వస్త్రలత బజార్ లో షాపింగ్ తో సందడి నెలకొంది.

డిసెంబర్ 30వ, తేది వరకు రద్దు చేసిన నగదును మార్పిడి చేసుకొనే అవకాశం ఉన్నందున ఇబ్బంది లేదని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.చట్టబద్దంగానే వ్యాపారం చేస్తున్నామని ఎలాంటి ఇబ్బందులు తమకు లేవని వ్యాపారులు దీమాను వ్యక్తం చేస్తున్నారు.వస్త్ర వ్యాపారులు ఇచ్చిన బంపర్ ఆఫర్ తో ప్రజలు సాపింగ్ తో బిజీబిజీగా ఉన్నారు.

English summary
buy any clothes in our shops with banned currency bumper offer to vijayawada people . entire country banned currency not accept the traders. but vijayawada cloth stores propraitors were offered to people come to buy any thing with banned currency.till dec 30th govt permit the banned currency deposit in banks. so, vijayawada cloth sotres mamagements take this decission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X