మీరు మారరా? ఆస్తులు కూడబెట్టుకున్నవారికి టిక్కెట్లా?

స్వపక్షంలోనే విపక్షంలా తయారైన విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని వ్యవహారం రోజురోజుకు క్లిష్టంగా మారుతోంది. నాని చేసే వ్యాఖ్యలు పార్టీకి, అధినేత చంద్రబాబుకు నష్టం చేకూర్చేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారానికి ముగింపు ఇవ్వకపోతే చివరకు నష్టపోయేది కూడా తెలుగుదేశం పార్టీయే నంటున్నారు.

ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడంలేదు

ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడంలేదు


కేశినేని ఎప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కావడంలేదని, ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నారనేదానిపై స్పష్టత రావడంలేదని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. 2019 ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుంచి వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న నాని వ్యవహారాన్ని చంద్రబాబు కాస్తంత లైట్ తీసుకున్నారు. కానీ దీన్ని అలుసుగా భావించి చంద్రబాబుపైనే నేరుగా విమర్శనాస్త్రాలు సంధించడం ప్రారంభించారు. తన సోదరుడు కేశినేని చిన్నికి టికెట్ ఇస్తే పనిచేసేది లేదని స్పష్టత ఇచ్చారు. అంతేకాకుండా కొందరి పేర్లు పైకి చెబుతుండగా, మరికొందరి పేర్లను నర్మగర్భంగా ప్రస్తావిస్తున్నారు. వారికి టికెట్ ఇస్తే తాను పనిచేయనంటున్నారు. విజయవాడ లోక్ సభ పరిధిలోకి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలతోను నానికి వివాదం నడుస్తోందంటున్నారు.

పార్టీ నేతలపై విమర్శల వర్షం

పార్టీ నేతలపై విమర్శల వర్షం

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు వర్థంతి రోజు కూడా కేశినేని తన పంథాలోనే మాట్లాడారు. విజయవాడ పరిధిలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న నాని పార్టీ నేతలపై విమర్శల వర్షం కురిపించారు. ఆస్తులు పోగొట్టుకున్నవారికి కాకుండా కూడబెట్టుకున్నవారికి టికెట్లిస్తున్నారని ఆరోపించారు.
విజయవాడ పరిధిలో అనేక చోట్ల జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న నాని.. పలువురు నేతలపై విమర్శల వర్షం కురిపించారు. పార్టీలో ప్రక్షాళణ జరగాలని, నిజాయితీగా పని చేసే వారికే టిక్కెట్లివ్వాలని డిమాండ్ చేశారు.

రంగంలోకి దిగిన చంద్రబాబు

రంగంలోకి దిగిన చంద్రబాబు

పదే పదే కేశినేని నాని సొంత పార్టీ నేతలపై విమర్శలు చేస్తుండటంతో జరుగుతున్న విషయం మొత్తం చంద్రబాబు దగ్గరకు చేరింది. అసలు ఏం జరుగుతోంది? కేశినేని ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఎక్కడ ఏం జరిగింది? అనే విషయాన్ని ఆరా తీశారు. దేవినేని ఉమ, బొండా ఉమ, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా తదితర నాయకులతో కేశినేనికి పడటంలేదు. వారంతా చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. రెండురోజుల్లో పరిస్థితిని చక్కదిద్దుతానని చంద్రబాబు నాయకులకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+