లోకేష్ పనికిమాలినోడు, వాళ్లంతా ఊరకుక్కలు- రెచ్చిపోయిన కేశినేని నాని..!
టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్లాక ఆ పార్టీ నేతలు తనను టార్గెట్ చేస్తున్న తీరుపై ఇవాళ విజయవాడ ఎంపీ కేశినేని నాని తీవ్రంగా మండిపడ్డారు. తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసిన ఆయన.. తనపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలకు ఘాటు కౌంటర్ ఇచ్చారు. బుద్ధా వెంకన్న నుంచి చంద్రబాబు వరకూ ఎవరినీ వదలకుండా కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ ఎంపీ సీటు పరిధిలోని తిరువూరు నియోజకవర్గంలో 65 వాటర్ ట్యాంకర్లు ఎంపీ నిధులతో అందజేసినట్లు ఎంపీ కేశినేని నాని గుర్తుచేశారు. చంద్రబాబు కమీషన్ల కోసం గత ఎన్నికలకు ముందు చింతలపూడి ఎత్తిపోతల పథకానికి శంఖుస్ధాపన చేసినట్లు నాని ఆరోపించారు. అలాగే ఏ.కొండూరు ప్రాంతంలో కిడ్నీ రోగుల గురించి చంద్రబాబు ఏ రోజు పట్టించుకోలేదన్నారు.
కానీ జగన్ మాత్రం ధనికుల పిల్లలతో చదువులో పోటీ పడేలా నాడు నేడు ద్వారా స్కూళ్లు అభివృద్ధి చేశారని కితాబిచ్చారు.

చంద్రబాబుకు నారావారిపల్లెలో వాళ్ళ తాతది తప్ప తనకు సొంతిల్లు లేదని ఎంపీ కేశినేని విమర్శించారు. అలాగే ఆయన కొడుకు నారా లోకేష్ ఒక పనికి మాలినోడన్నారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని, తన సొంత రాష్ట్రం తెలంగాణకు వెళ్లేందుకు చంద్రబాబు సిద్దంగా ఉన్నాడన్నారు. చంద్రబాబు అనేక ఊర కుక్కలను పెట్టుకుంటాడని, పార్టీ నుండి వెళ్ళే వారిపై విమర్శించడమే వారి పని అన్నారు.
జాతీయ అధికార ప్రతినిధి అనే ఒక ఊర కుక్కని పెట్టుకుని సీఎంను బోసడికె అని తిట్టించిన నైజం చంద్రబాబుదని టీడీపీ నేత పట్టాభిని ఉద్దేశించి ఎంపీ కేశినేని విమర్శించారు. వీళ్ళు సమాజానికి మంచి చేస్తున్నారా,చెడు చేస్తున్నారా అనేది చంద్రబాబు,లోకేష్ ను అడగాలన్నారు. ఊర కుక్కల మాటలను పట్టించుకోనని, తనను చెప్పుతో కొడతా అంటూ మాట్లాడిన మాటలు ప్రజలందరికి తెలుసన్నారు. ఎవరిని ఎక్కువగా తిడితే ఆ ఊర కుక్కలకు, కాల్ మనీ కుక్కలకు పదవులు ఇస్తారంటూ కేశినేని ఘాటు వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications