నీ బిల్డప్ ఏందయ్యా - కేశినేని వర్సస్ పీవీపీ, మారుతున్న సమీకరణాలు..!!
విజయవాడ కేంద్రంగా రాజకీయ సమీకరణాలు వేగంగా మరుతున్నాయి. టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్టీ నాయకత్వం పై గుర్రుగా ఉన్నారు. ఎన్నికల వేళ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. తాజాగా వ్యాఖ్యలు అదే సూచిస్తున్నాయి. ఇదే సమయంలో వైసీపీ నేత గత ఎన్నికల్లో కేశినేని పైన పోటీ చేసిన పీవీపీ సీరియస్ గా స్పందించారు. కేశినేనిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసారు. కేశినేని..పీవీపీ ఇద్దరి రూటు ఇప్పుడు ఎప్పుడు ఎటు అనే చర్చ మొదలైంది.
నీ బిల్డప్ ఏందయ్యా @kesineni_nani
— PVP (@PrasadVPotluri) June 1, 2023
నువ్వేదో అల్లూరి కి ఎక్కువ, నేతాజీకి తక్కువ అన్నట్టు..
ప్రజాసేవ కోసం పుట్టానంటావు.. కానీ, దొబ్బెది బ్యాంకులని,జీతాలు ఎగదొబ్బేది కార్మికులకు.. వెరసి మన బెజవాడోళ్ళందరికి చేతిలో చిప్ప.. నోటిలో మట్టి.. వేదవ సోది ఆపి,కాస్త కొవ్వు కరిగించే పనిలో ఉండు..…
కేశినేని వ్యాఖ్యల వెనుక:టీడీపీ ఎంపీ కేశినేని కొద్ది కాలంగా మాటల పదును పెంచారు. వైసీపీ నేతలతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వైసీపీ నేతలను ప్రశంసిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కోరుకుంటే స్వతంత్రంగా పోటీ చేస్తానంటూ వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలను టీడీపీ నాయకత్వం ఏ రకంగా భావించినా తనకు నష్టం లేదన్నారు. ఏ పిట్టల దొరకు టికెట్ ఇచ్చినా తనకు సంబంధం లేదంటూ కామెంట్ చేసారు. రాష్ట్రంలో రాజకీయాలు లేవని రెండు వేదికలకు నాయకులుగా జగన్.. చంద్రబాబు మధ్య వైరమేనని పేర్కొన్నారు. తాను ఎంపీగా ఎన్నో సేవలు అందిచానని చెప్పుకొచ్చారు. ఎంపీగా గెలుస్తానా లేదా అనే ఆలోచన లేదన్నారు. కేశినేని వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీలో కలకలం రేపుతున్నాయి.

నాని పై పీవీపీ ట్వీట్:ఇదే సమయంలో ఇప్పుడు పీవీపీ స్పందించారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయవాడ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసిన పీవీపీ టీడీపీ అభ్యర్ధి కేశినేని నాని చేతిలో ఓడిపోయారు. నానికి ఆ ఎన్నికల్లో 5,75,498 ఓట్లు రాగా, పీవీపీకి 5, 66, 772 ఓట్లు వచ్చాయి. జనసేన నుంచి పోటీ చేసిన ముత్తంశెట్టి సుధాకర్ కు 81,650 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు కేశినేని నాని పైన పీవీపీ ట్విట్టర్ లో కీలక వ్యాఖ్యలు చేసారు. నీ బిల్డప్ ఏందయ్యా
@kesineni_nani..నువ్వేదో అల్లూరి కి ఎక్కువ, నేతాజీకి తక్కువ అన్నట్టు..ప్రజాసేవ కోసం పుట్టానంటావు.. కానీ, దొబ్బెది బ్యాంకులని,జీతాలు ఎగదొబ్బేది కార్మికులకు.. వెరసి మన బెజవాడోళ్ళందరికి చేతిలో చిప్ప.. నోటిలో మట్టి.. వేదవ సోది ఆపి,కాస్త కొవ్వు కరిగించే పనిలో ఉండు.. తర్వాత ఎన్నికల బరిలో దొర్లుకుంటూ వద్దువు!!..అంటూ పోస్టు చేసారు.
ఎవరు ఎటు వైపు:వైసీపీ రాజకీయాల్లో కొంత కాలంగా పీవీపీ క్రియాశీలకంగా లేరు. ఇప్పుడు టీడీపీ నేతల పైన భిన్న వ్యాఖ్యలు చేస్తున్న కేశినేని నాని ని పీవీపీ టార్గెట్ చేయటం ఆసక్తి కరంగా మారింది. తీవ్ర పదజాలంతో పీవీపీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. పీవీపీ రాజకీయ ఆలోచనలు మారుతున్నాయా అనే చర్చకు కారణం అవుతోంది. వచ్చే ఎన్నికల్లో కేశినేని నాని టీడీపీ నుంచి పోటీ చేయటం లేదంటూ బలమైన ప్రచారం సాగుతోంది. కేశినేని నాని చేస్తున్న వ్యాఖ్యలతో జిల్లాకు చెందిన కొందరు టీడీపీ నేతలు విభేదిస్తున్నారు. ఈ సమయంలో పీవీపీ కూడా కేశినేనిని టార్గెట్ చేస్తూ చేసిన ట్వీట్ తో కొత్త సమీకరణాలకు దారి తీస్తోంది. పీవీపీ అసలు లక్ష్యం ఏంటనే చర్చ బెజవాడ పొలిటికల్ సర్సిల్స్ లో మొదలైంది.












Click it and Unblock the Notifications