భక్తులకు విజ్ఞప్తి! విజయవాడలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు. రేపటి నుంచి అటు నో ఎంట్రీ..

దసరా సందర్భంగా విజయవాడ అంబరాన్నంటే సంబరాలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి ప్రారంభం కానున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 20 వరకు ఘనంగా జరగనున్నాయి. ఈసారి పండుగ వేళ కృష్ణా తీరంలోని పున్నమి ఘాట్‌లో ఈనెల 13 నుంచి అఖిల భారత 'సరస్' మేళా కూడా మొదలుకానుంది. వివిధ రాష్ట్రాల స్వయం సహాయక సంఘాల హస్తకళలు, ఉత్పత్తుల ప్రదర్శనకు వేదిక కానున్న ఈ వేడుకకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరానున్నారు.

దీనికి తోడు నగరంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో 'విజయవాడ ఉత్సవ్' సైతం కనువిందు చేయనుంది. ఇన్ని ప్రత్యేక కార్యక్రమాలతో నగరంలో ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు పోలీసు శాఖ ఇప్పటి నుంచే పకడ్బందీ ప్రణాళిక అమలు చేస్తోంది. పండుగ రద్దీ నుంచి భారీ వాహనాలను మళ్లించేందుకు ప్రత్యేక ప్రత్యామ్నాయ మార్గాలను ఖరారు చేసింది.

Vijayawada Traffic Diversions Announced for Dasara Navaratri Festival and Saras Mela Celebrations

హైదరాబాద్ - ఏలూరు ప్రయాణాలకు బైపాస్ రూట్

పండుగ రద్దీ నగరంలోకి రాకుండా ఉండేలా సుదూర ప్రాంతాలకు వెళ్లే భారీ వాహనాలకు పోలీసులు ప్రత్యేక మార్గాలను సూచించారు. హైదరాబాద్ నుంచి ఏలూరు వైపు వెళ్లే లారీలు, ఇతర భారీ వాహనాలు నల్లకుంట మీదుగా విజయవాడ బైపాస్‌ను తాకాలి. అక్కడి నుంచి వెదురుపావులూరు టోల్‌ప్లాజా, చిన్నఆవుటపల్లి మీదుగా ఏలూరు చేరుకోవాలి. తిరుగు ప్రయాణంలో ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు కూడా ఇదే మార్గంలో అంటే చిన్నఆవుటపల్లి, వెదురుపావులూరు బైపాస్ మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకోవాల్సి ఉంటుంది.

దుర్గమ్మ దర్శనానికి రాష్ట్రపతి, సీఎం విజయ్!
దుర్గమ్మ దర్శనానికి రాష్ట్రపతి, సీఎం విజయ్!

చెన్నై రూట్లలో భారీ వాహనాల రాకపోకలు

హైదరాబాద్ నుంచి చెన్నై వైపు వెళ్లే భారీ వాహనాలు ఇబ్రహీంపట్నం, నల్లకుంట, విజయవాడ బైపాస్ మీదుగా వెంకటపాలెం టోల్‌ప్లాజాను చేరుకుని గుంటూరు, ఒంగోలు, నెల్లూరు మీదుగా వెళ్లాలి. అలాగే ఏలూరు నుంచి చెన్నై వెళ్లే వాహనాలు చిన్నఆవుటపల్లి, విజయవాడ బైపాస్, వెంకటపాలెం టోల్‌ప్లాజా, కాజ టోల్‌గేట్ మీదుగా గుంటూరు-చెన్నై హైవేను పట్టుకోవాలి. చెన్నై నుంచి హైదరాబాద్ లేదా ఏలూరు వైపు వచ్చే వాహనాలు నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, కాజ మీదుగా విజయవాడ బైపాస్ గుండా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా రూట్లు మార్చారు.

దసరా వేళ ఇంద్రకీలాద్రి భక్తులకు బిగ్ అలర్ట్ - టికెట్లు, దర్శనం లో కీలక మార్పులు..!!
దసరా వేళ ఇంద్రకీలాద్రి భక్తులకు బిగ్ అలర్ట్ - టికెట్లు, దర్శనం లో కీలక మార్పులు..!!

మచిలీపట్నం వైపు వెళ్లే డ్రైవర్లకు గమనిక

మచిలీపట్నం వైపు రాకపోకలు సాగించే భారీ వాహనాల రూట్లలోనూ మార్పులు చేశారు. చెన్నై వైపు నుంచి మచిలీపట్నం వెళ్లే వాహనాలు గుంటూరు, కాజ, విజయవాడ బైపాస్, నల్లకుంట, వెదురుపావులూరు, చిన్నఆవుటపల్లి, కేసరపల్లి, ఉప్పులూరు, కంకిపాడు, ఉయ్యూరు మీదుగా మచిలీపట్నం చేరుకోవాలి. ఇక మచిలీపట్నం నుంచి ఒంగోలు లేదా హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు తాడిగడప వంద అడుగుల రోడ్డు, ఎనికేపాడు, చిన్నఆవుటపల్లి మీదుగా బైపాస్‌ను చేరుకుని తమ ప్రయాణాన్ని సాగించవచ్చు.

ప్రయాణికులు, డ్రైవర్లు సహకరించాలి: ట్రాఫిక్ పోలీసుల విజ్ఞప్తి

దసరా ఉత్సవాల సమయంలో నగర ప్రజలకు, ఇతర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఈ మళ్లింపులు దోహదపడతాయని అధికారులు స్పష్టం చేశారు. భారీ వాహనాల డ్రైవర్లు ఎవరూ నగరంలోకి ప్రవేశించకుండా, పోలీసులు సూచించిన ఈ బైపాస్ మార్గాలనే ఉపయోగించాలని కోరారు. పండుగ సంతోషంలో ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+