బెజవాడ టిడిపిలో కలకలం : బెజవాడ పశ్చిమ నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ భాద్యతలు ఎంఎల్ఏ జలీల్ ఖాన్ కు
విజయవాడ:విజయవాడ టిడిపిలో మార్పులు చేర్పులకు అధిష్టానం శ్రీకారం చుట్టింది. బెజవాడ పశ్చిమ నియోజవర్గ టిడిపి ఇంచార్జ్ భాద్యతలను ఎంఎల్ఏ జలీల్ ఖాన్ కు అప్పగించించి అధిష్టానం.పార్టీ తీసుకొన్న నిర్ణయం పట్ల కార్యకర్లలు విస్మయం చెందుతున్నారు.
పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న సమయంలో నాగుల్ మీరా పార్టీతోనే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎంఎల్ఏ గా విజయం సాధించిన తర్వాత ఇటీవలే పార్టీని వీడి టిడిపిలో చేరారు పశ్చిమ నియోజకవర్గ ఎంఎల్ఏ జలీల్ ఖాన్.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత ఆయన జగన్ పై విమర్శలు గుప్పించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి వచ్చిన జలీల్ ఖాన్ కు పశ్చిమ నియోజకవర్గ ఇన్ చార్జ్ భాద్యతలు అప్పగించడంలో ఆంతర్యమేమిటని పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.మీరాకు ఇతర భాద్యతలు కట్టబెడుతారా అనేది ఇంకా తేలాల్సి ఉంది.ఈ కారణంతోనే మీరాను పార్టీ భాద్యతల నుండి తప్పించారనే వాదన కూడ పార్టీ వర్గాల్లో ఉంది.
హాఠాత్తుగా పార్టీ భాద్యతల నుండి మీరాను తప్పించడం పట్ల ఆయన వర్గీయులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.జలీల్ ఖాన్ పార్టీలో చేరే సమయంలో మీరా వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications