హైదరాబాద్ నుంచి విశాఖ వైపు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఇక నుంచి..!!
విజయవాడ-హైదరాబాద్ ప్రయాణీకులకు బిగ్ అప్డేట్. వైస్ట్ బైపాస్‌లో భాగంగా కాజ-గొల్లపూడి మధ్య 17.88 కి.మీ, గొల్లపూడి-చిన్నఅవుటపల్లి మధ్య 30 కి.మీ. ఆరు వరుసల హైవే నిర్మాణం చేపట్టారు. గొల్లపూడి మీదుగా చిన్న అవుటుపల్లి టోల్‌గేట్ జంక్షన్ వరకూ వెళ్లేందుకు వీలుగా ఒకవైపు రహదారిని ఎన్‌హెచ్‌ఏఐ సిద్ధం చేసింది. గుంటూరు నుంచి అమరావతి, గొల్లపూడి, విజయవాడ, హైదరాబాద్, ఏలూరు, ఉత్తరాంధ్ర వైపు వెళ్లే వారికి వీలుగా రాకపోకలను అనుమతిస్తున్నారు.
ఈ బైపాస్‌తో చెన్నై, గుంటూరు మార్గంలో రహదారిపై రద్దీ కాస్త తగ్గుతుంది. విజయవాడ ట్రాఫిక్ లో చిక్కుకోకుండా ప్రయాణాలు సాగించే అవకాశం ఉంటుంది. దీనివలన చెన్నై, గుంటూరుల నుండి వచ్చే వాహనాలకు ప్రయోజనం చేకూరనుంది. కాజా టోల్‌గేట్ దాటి బైపాస్‌లోకి వచ్చి గొల్లపూడి మీదుగా చిన్నఅవుటపల్లి వరకు వెళ్లి ఏలూరు హైవేలోకి కలవవచ్చు. గుంటూరు నుండి హైదరాబాద్ వెళ్లే వాహనాలు గొల్లపూడి వద్ద విజయవాడ-హైదరాబాద్ హైవేలోకి ప్రవేశించవచ్చు. ఇప్పుడు కాజ-గొల్లపూడి మధ్య కూడా ఒకవైపు వాహనాలను అనుమతించనున్నారు. నేటి వరకు 29.57 కిలోమీటర్ల పనులు పూర్తి అయ్యాయని, మిగిలిన 0.43 కిలోమీటర్ల పనులు మార్చి నెలాఖరులోగా పూర్తి చేశామని అధికారులు వెల్లడించారు. రూ.1,148.40 కోట్ల అంచనా వ్యయంతో ఈ నిర్మాణం చేపట్టారు. గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు ఈ బైపాస్ మీదుగా నేరుగా గొల్లపూడి, అక్కడి నుంచి చిన్నఅవుటపల్లి మీదుగా ఏలూరు వైపు వెళ్లవచ్చు.

గుంటూరు నుంచి హైదరాాబాద్ వెళ్లే వారికి సమయం ఆదా
ప్రస్తుతం కృష్ణా నది, సీడ్ యాక్సెస్ రోడ్ దాటిన తర్వాత బైపాస్ నుంచి పక్కకు దిగి మందడం వెళ్లే రోడ్‌లోకి చేరుకొని సెక్రటేరియట్, హైకోర్టు వైపు వెళ్లేందుకు వాహనాలను అనుమతిస్తున్నారు. ఇప్పుడు గొల్లపూడి వైపు నుంచి గుంటూరు వైపు వెళ్లాలనుకునే వాహనాలను కూడా హాయ్‌ల్యాండ్ రోడ్ వరకు అనుమతించేలా నిర్ణయం తీసుకున్నారు. బైపాస్‌లో టోల్‌ప్లాజా దాటాక ముందుకు వెళ్లేందుకు అవకాశం లేదు. పదో తేదీ సాయంత్రం నుంచి అందుకు అనుమతించి హాయ్‌ల్యాండ్ రోడ్ వరకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తారు. కాగా.. విజయవాడ బైపాస్, కోల్‌కతా-చెన్నై రహదారి ని పూర్తిగా అనుసంధానం చేసే పనులు వచ్చే నెలలో పూర్తికానున్నాయి. అప్పటి నుంచి గొల్లపూడి నుంచి వచ్చే వాహనాలన్నీ నేరుగా చెన్నై-కోల్‌కతా హైవేలోకి చేరుకొని, చెన్నై వైపు వెళ్లే అవకాశం ఏర్పడుతుందని అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications