జగన్ పార్టీ దినేష్ రెడ్డి, కాంగ్రెస్ నేత విక్రమ్‌గౌడ్ హల్‌చల్

హైదరాబాద్: మాజీ డిజిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మల్కాజిగిరి లోకసభ అభ్యర్థి దినేష్ రెడ్డి హల్ చల్ సృష్టించారు. మల్కాజిగిరి పరిధిలోని ఓ పోలింగ్ బూత్‌లోకి ఆయన యాభై మందితో కలిసి వెళ్లారు. ఆయన మాజీ డిజిపి కావడంతో పోలీసులు వదిలేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

మహబూబ్ నగర్లో...

మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్‌లో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.

Vikram Goud has attcked TDP leader

విక్రమ్ గౌడ్ హంగామా

హైదరాబాద్‌లోని గౌలిగూడలో మాజీ మంత్రి, కాంగ్రెసు అభ్యర్థి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ తెలుగుదేశం పార్టీ నేతపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. టిడిపి నేత దుర్గాదాస్‌పై ఆయన దాడి చేసినట్లు ఆరోపిస్తున్నారు. దీంతో టిడిపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బిజెపి అభ్యర్థి రాజాసింగ్.. విక్రమ్ గౌడ్ అరెస్టుకు డిమాండ్ చేశారు.

ఇన్నోవాలో ఇరవై లక్షలు

నల్గొండ జిల్లా సూర్యాపేటలో ఇన్నోవా కారు ఇంజన్లో మంటలు రాడంతో కారులో ఉన్న రూ.20 లక్షలు దగ్ధమయ్యాయి. కారుపై హుజార్‌నగర్ కాంగ్రెసు అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టిక్కర్ ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+