రోడ్డుపై అర్ధరాత్రి టాలీవుడ్ హీరో, బడాబాబుల పిల్లల హల్‌చల్!
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో శనివారం అర్ధరాత్రి పూట కొందరు బడాబాబుల పిల్లలు ఓ ఐపీఎస్ అధికారి ఇంటి ముందు హంగామా చేశారని తెలుస్తోంది. తమ ఇంటి ముందు హంగామా చేయడంతో అతను కంట్రోల్ రూంకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రావడంతో పరిస్థితి సద్దుమణిగింది.
అర్ధరాత్రి ఈ గొడవ ఏమిటంటూ వారిని స్థానికులు కూడా ప్రశ్నించారు. దాంతో వారు ఘాటుగా స్పందించారని తెలుస్తోంది. ఇది చూసిన ఐపీఎస్ అధికారి తన ఇంటి ముందు జరుగుతున్న రగడను పోలీసు కంట్రోల్ రూంకు సమాచారం అందించడంతో వారు వచ్చారు.

కాగా, హల్‌చల్ చేసిన వారిలో రాజకీయ నాయకుల కుమారులతో పాటు ఓ ప్రముఖ హీరో కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. మాజీ ఎంపీ, ఎమ్మెల్యే కుమారులు ఉన్నారని సమాచారం.
కేబీఆర్ పార్క్‌లో అగ్ని ప్రమాదం
హైదరాబాదులోని కేబీఆర్ పార్కులో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో మంటలు చెలరేగి చెట్లకు అంటున్నాయి. ఘటనస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు.












Click it and Unblock the Notifications