Viral video: జనసేన జెండా కిందపడేసి..జూ.ఎన్టీఆర్ భారీ పతాకాన్ని ఎగరేసి: ఆ విషయంపై క్లారిటీ

అమరావతి: అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ఆర్ఆర్ఆర్ సినిమా ఇంకొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్-మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన హైఓల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ మల్టీ స్టారర్ సినిమా ఇది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకుడు. డీవీవీ దానయ్య నిర్మాత. ఈ మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. బాహుబలి రికార్డులను సైతం తిరగరాస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

Recommended Video

    RRR Pre Release Event : జనసేన జెండా కిందపడేసి NTR ను ఎగరేసి Mega Vs Nandamuri | Oneindia Telugu
    హ్యాట్రిక్ హీరో కూడా..

    హ్యాట్రిక్ హీరో కూడా..

    ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తాజాగా కర్ణాటకలోని చిక్‌బళ్లాపురలో నిర్వహించింది యూనిట్. శనివారం రాత్రి లక్షలాది మంది అభిమానుల మధ్య ఈ కార్యక్రమం పూర్తయింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్, శాండల్‌వుడ్ సూపర్‌‌స్టార్, హ్యాట్రిక్ హీరో దీనికి హాజరయ్యారు. శుభాకాంక్షలు తెలిపారు. శివరాజ్ కుమార్‌, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో పాటు పలువురు యూనిట్ సభ్యులు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు.

    గ్రౌండ్ మొత్తం జెండాల మయం..

    నందమూరి, మెగా కాంపౌండ్ హీరోల అభిమానులు లక్షలాది మంది ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఏపీ సరిహద్దులకు దగ్గరగా ఉండే పట్టణం కావడం వల్ల వేలాదిమంది అభిమానులు బైక్‌లపై చిక్‌బళ్లాపురాకు చేరుకున్నారు. తమ అభిమాన హీరోల జెండాలను ప్రదర్శించారు. చిక్ బళ్లాపురాకు వెళ్లే మార్గంలో తమ హీరోల జెండాలను కట్టారు. ఫ్లైఓవర్ల వద్ద భారీ బ్యానర్లను వేలాడదీశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటుచేసిన గ్రౌండ్‌ మొత్తం జెండాలతో నింపేశారు.

    నందమూరి కుటుంబం ఫ్యాన్ బేస్ అధికం..

    ఈ కార్యక్రమంలో పసుపు జెండాలు భారీగా కనిపించాయి. ఎన్టీఆర్ ఫొటోలను ముద్రించిన జెండాలు విస్తృతంగా కనిపించాయి. చిక్‌బళ్లాపురాకు సమీపంలో ఉన్న హిందూపురం- నందమూరి కుటుంబానికి కంచుకోట. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో నందమూరి బాలకృష్ణ, జూనియన్ ఎన్టీఆర్ అభిమానుల హవా అధికంగా కనిపిస్తుంటుంది సాధారణంగా. హిందూపురం, గోరంట్ల, సీకే పల్లి, ఓడీ చెరువు, ధర్మవరం, పుట్టపర్తి.. చిత్తూరు జిల్లాలోని కుప్పం వంటి ప్రాంతాల్లో బాబాయ్ అబ్బాయ్‌లకు ఫ్యాన్ బేస్ బలంగా ఉంది. ఆయా ప్రాంతాల నుంచీ అభిమానులు పెద్ద సంఖ్యలో చిక్‌బళ్లాపురాకు చేరుకున్నారు.

    జనసేన జెండా తొలగించి..

    ఇదంతా ఒక ఎత్తయితే.. ఈ ఈవెంట్‌లో జనసేన పార్టీ జెండా రెపరెపలాడటం మరో ఎత్తుగా మారింది. కర్రలతో ఏర్పాటు చేసిన ఓ ఎత్తయిన టవర్‌పై జూనియర్ ఎన్టీఆర్ జెండాల మధ్య జనసేన ఫ్లాగ్ రెపరెపలాడుతూ కనిపించింది. మెగా కాంపౌండ్ హీరోల అభిమానులు ఈ జెండాను అక్కడ కట్టారు. దీన్ని చూసిన తరువాత జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్- అసహనానికి గురయ్యారు. ఆ టవర్ పైకి ఎక్కి మరీ జనసేన జెండాను కిందికి విసిరేశారు. దాని స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ ఫొటోను ముద్రించిన ఓ భారీ పతాకాన్ని ఎగురవేశారు. దీనికి సంబంధించిన వీడియో- సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    టీడీపీ-జనసేన పొత్తుపై..

    జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ ఆయన అభిమానులు చాలాకాలంగా డిమాండ్ చేస్తోన్నారు. తెలుగుదేశం పార్టీ పగ్గాలను అందుకోవాలంటూ పట్టుబడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సమక్షంలోనే పలు సందర్భాల్లో ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టారు. ఆయన తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వచ్చిన ప్రతీసారీ ఈ డిమాండ్ వినిపిస్తూనే ఉంటుంది. అలాంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్.. జనసేన పార్టీ పతాకాన్ని తొలగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టీడీపీ-జనసేన మధ్య పొత్తు తమకు ఇష్టం లేదనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్టయింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+