డప్పు వాయించిన ఎమ్మెల్యే - స్టెప్పులతో దుమ్ము రేపిన మంత్రి రోజా..!!
వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాలో మంత్రి అయినా ఇంకా సినీ జోష్ తగ్గలేదు. పాట వినిపిస్తే చాలు డాన్స్ వేయాల్సిందే. వైసీపీ ఎమ్మెల్యే డప్పు కొడుతూ స్టెప్పులు వేస్తుంటే..రోజా తన డాన్స్ ఫెర్ఫాన్స్ తో దుమ్మురేపారు. వచ్చే నెల 21న ముఖ్యమంత్రి జగన్ జన్మదినం. ఈ సందర్ఢంగా రాష్ట్ర పర్యటక - సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు నిర్వహిస్తెన్నారు. ఈ నెల 19న తిరుపతి వేదికగా వీటిని మంత్రి రోజా ప్రారంభించారు. మూడు రోజుల పాటు తిరుపతిలో ఈ ఉత్సవాలు జరిగాయి.
ప్రారంభం రోజున మంత్రి రోజా ధింసా - బంజారా డాన్స్ చేస్తూ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. బంజారా డాన్స్ లో వేసిన స్టెప్పులలో పార్టీ అభిమానుల కేరింతలతో తిరుపతితో మహతి స్టేడియం మార్మోగింది. ఇక, తిరుపతి తరువాత ఈ రోజు గుంటూరులో ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమయంలో కళకారులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే ముస్తఫా డప్పు వాయిస్తూ స్టెప్పులు వేసారు.
ఆహుతుల్లో జోష్ నింపే ప్రయత్నం చేసారు. ఎమ్మెల్యేకు ధీటుగా మంత్రి రోజా స్టేజ్ పైన కళాకారులతో కలిసి డాన్స్ చేసారు. వేదిక పై చెక్క భజన కళాకారులతో అందమైన దానా ,చందమామ లాంటి. అనే సాంగ్ కి స్టెప్పులు వేసి దుమ్ము రేపారు. సభకు హాజరైన వారంతా రోజా డాన్స్ ను తమ మొబైల్ ఫోన్లలో బంధించారు.
జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక కార్యక్రమంలో స్టెప్స్ తో ఇరగదీసిన మంత్రి రోజా..!!#MLARoja #RojaSelvamani #OneIndiaTelugu pic.twitter.com/DvLF4EomLc
— oneindiatelugu (@oneindiatelugu) November 24, 2022
రోజా డాన్స్ చేస్తున్న సమయంలో మహిళల నుంచి పెద్ద ఎత్తున స్పందన..మద్దతు లభించింది. పూర్తి హాహభావాలు ప్రదర్శిస్తూ రోజా డాన్స్ కొనసాగింది. స్టేజ్ పైన ఆర్టిస్టులకు ఏ మాత్రం తీసిపోకుండా, ఒక విధంగా తానే మెయిన్ ఆర్టిస్ట్ అన్నట్లుగా డాన్స్ లో లీనమై పోయారు. డాన్స్ మాత్రమే కాదు..మంత్రి రోజా చెక్క భజన కూడా చేసారు. ఇప్పుడు మంత్రి రోజా డాన్స్ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగున్నాయి.

ఆ తరువాత నెల్లూరు, రాజమండ్రిల్లోనూ వీటిని కొనసాగించనున్నారు. చివరగా విజయవాడలో రాష్ట్ర స్థాయి పోటీలు డిసెంబర్ 19, 20 తేదీల్లో నిర్వహించేందుకు నిర్ణయించారు. జోనల్..రాష్ట్ర స్థాయిలో ఈ ఉత్సవాలు - పోటీలు నిర్వహిస్తున్నారు. 21న సీఎం జగన్ జన్మదినం నాడు జరిగే సభలో విజేతలకు పురస్కారాలు అందించనున్నారు. ఇక, ఇప్పుడు మొన్న తిరుపతి..నేడు గుంటూరులో మంత్రి రోజా డాన్స్ వైరల్ గా మారింది.












Click it and Unblock the Notifications