స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పై భారీ దెబ్బ, ఇక నుంచి..!!
విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్రం ఆర్దికంగా ప్యాకేజీ ప్రకటన తరువాత కార్మికుల్లో భరోసా పెరిగింది. అయితే, వరుసగా చోటు అమల్లోకి వస్తున్న నిర్ణయాలతో మరోసారి ఆందోళన మొదలైంది. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఉండదని ఎన్డీఏ నేతలు పదే పదే చెబుతున్నారు. కాగా.. ప్లాంట్ యాజమాన్యం నిర్ణయాలు మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. తాజాగా ఉద్యోగుల విషయంలో అమల్లోకి తెచ్చిన నిర్ణయం మరోసారి ఉద్యోగుల ఆగ్రహానికి కారణంగా మారుతోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించింది. విభాగాల వారీగా నిర్దేశించిన ఉత్పత్తిని వంద శాతం సాధిస్తేనే పూర్తి జీతాలు ఇస్తామని ఇటీవల యాజమాన్యం ప్రకటించింది. లక్ష్యానికి ఎంత శాతం తగ్గితే అంత మేర జీతాల్లో కోత పెడతామని హెచ్చరించింది. దానిని నవంబర్ నెల నుంచే అమలు చేస్తూ డిసెంబర్ లో ఇచ్చే జీతాల్లో భారీ కోత విధించింది. మెటీరియల్ మేనేజ్ మెంట్ విభాగంలో పని చేసే వారికి కేవలం 66 శాతమే జీతాలు ఇవ్వనుంది. రోలింగ్ మిల్స్ విభాగానికి 79 శాతం, సెంటర్ ప్లాంటుకు 80 శాతం, ఎస్ఎంఎస్ కు 81 శాతం, బ్లాస్ ఫర్నేస్..ఇతరులకు 83 శాతం, మార్కెటింగ్ కు 84 శాతం, కోక్ ఓవెన్ విభాగానికి 93 శాతం జీతాలు ఇస్తున్నట్లు ప్లే స్లిప్పుల్లో చూపింది.

దీంతో, ఉద్యోగులు నిరసనకు దిగారు. లిక్విడ్ స్టీల్ ను ఉక్కు దిమ్మెలుగా మార్చే ఎస్ఎస్ఎస్ -2 విభాగం ఉద్యోగులు ఆందోళన ప్రారంభించారు. కాగా, ఈ రోజు అన్ని విభాగాల్లో ఆందోళన చేపట్టాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. సిబ్బంది అంతా ఆందోళన బాట పడితే ఉక్కు ఉత్పత్తి మరింత పడిపోయే ప్రమాదం ఉందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ీ రోజు ఉదయం నుంచి కార్మికులు నిరసలనకు దిగారు. వేతనాల కోత పైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రంలో - రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం ఆర్దిక ప్యాకేజీ ప్రకటించింది. దీని ద్వారా స్టీల్ ప్లాంట్ పూర్తిగా కోలుకొని లాభాల బాట పడుతుందని కార్మికులు భావించారు. కాగా.. కొద్ది రోజులుగా యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాల పైన కార్మికుల్లో ఆందోళన నెలకొంది. ఈ నెల భారీగా వేతనాల కోత విధించటంతో... డిసెంబర్ నెల ఉత్పత్తి ఎలా ఉంటుందనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications