స్టీల్ ప్లాంట్ లో బిగ్ ట్విస్ట్, ప్రైవేటీకరణ టెండర్లు - కూటమి నేతలకు పరీక్ష...!!

విశాఖ స్టీల్ ప్లాంట్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్రం ఆర్దిక ప్యాకేజీతో ఇక స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ లేనట్లే అని అందరూ భావించారు. కూటమి నేతలు సైతం ప్లాంట్ భవిష్యత్ పైన హామీ ఇచ్చారు. కాగా, తాజాగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం పలు విభాగాల ప్రైవేటు పరం చేసేందుకు టెండర్లు జారీ చేసింది. దీంతో, అసలు ఏం జరుగుతుందనే టెన్షన్ కార్మికుల్లో మొదలైంది. కీలక విభాగాలు ప్రైవేటు వారికి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ లో అనూహ్య నిర్ణయాలు జరుగుతున్నాయి. విశాఖ ఉక్కు యాజమాన్యం తాజా నోటిఫికేషన్‌ జారీతో కొత్త సమస్య తెర మీదకు వచ్చింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పూర్తిస్థాయిలో ప్రైవేటీకరించే దిశగా అడుగులు పడుతున్నాయనే అందోళన వ్యక్తం అవుతోంది. కర్మాగారాన్ని రక్షిస్తామని యాజమాన్యం ఒకవైపు ప్రకటనలు చేస్తూనే, మరో వైపు దశలవారీగా విభాగాలను ప్రైవేటీకరించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా కర్మాగారంలో కీలకమైన 34 విభాగాలను ప్రైవేటీకరించేందుకు ఉక్కు యాజమాన్యం నోటిఫికేషన్‌ జారీచేయడం సంచలనంగా మారుతోంది. ఈ వ్యవహారంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

visakha-steel-plant-latest-notification-on-privatization-leads-to-new-confusion-in-employees

ఒక పక్క ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్నా.. మరోవైపు ప్లాంట్‌లో ఒక్కో విభాగం ప్రైవేటీకరించేందుకు యాజమాన్యం ప్రణాళికాయుతంగా అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు కొన్ని విభాగాలను ప్రైవేటీకరించేందుకు వరుసగా నోటిఫికేషన్‌లు జారీ చేయగా, తాజాగా ఒకేసారి 34 విభాగాలను ప్రైవేటీకరించేందుకు ప్రకటన విడుదల చేసింది. ఓ పక్క ప్లాంట్‌కు పూర్వ వైభవం తెస్తామని చెబుతున్న యాజమాన్యం.. ఇలా అన్ని విభాగాలను ప్రైవేటీకరించేందుకు నోటిఫికేషన్‌లు జారీ చేయటంతో అసలు ప్లాంట్‌లో ఏం జరుగుతోందో తెలియడం లేదని కార్మిక సంఘాలు ఆందోళన చెందుతన్నాయి. కేంద్రం రూ 11 వేల కోట్ల ఆర్దిక ప్యాకేజీ ప్రకటన తరువాత ప్లాంట్ ప్రయివేటీకరణ ఆగినట్లేనని అందరూ భావించారు.

కేంద్ర మంత్రులతో సహా.. కూటమి నేతలు ప్లాంట్ భవితవ్యం పైన హామీ ఇచ్చారు. కార్మికులు ప్రస్తుతం కేంద్రం ఇచ్చిన ఉపశమనంతో... మరింతగా కష్టపడి ఉత్పత్తి పెంచుకోవాలని కూటమి నేతలు సూచించారు. కాగా, ఇప్పుడు కీలక విభాగాలను ప్రయివేటు వ్యక్తులకు అప్పగించేందుకు టెండర్లు జారీ చేయటం కార్మికులకు అంతు చిక్కటం లేదు. దీంతో, వారు ప్లాంట్ వద్ద నిరసనలు మొదలు పెట్టారు. టెండర్లు జారీ అయిన వాటిల్లో క్యాప్టివ్‌ పవర్‌ప్లాంట్‌, వేస్ట్‌ హీట్‌ రికవరీ థర్మల్‌ పవర్‌ప్లాంట్‌, క్యాప్టివ్‌ పవర్‌ప్లాంట్‌-2, వైర్‌రాడ్‌ మిల్‌, బ్లాస్ట్‌ఫర్నేస్‌ -1, 2, 3 విభాగాలు కూడా ఉండటంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+