విశాఖ ఉత్సవ్: పంచ్ డైలాగులతో బాలయ్య సందడి (ఫోటోలు)
అమరావతి: విశాఖను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ప్రముఖ సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఆదివారం జరిగిన ‘విశాఖ ఉత్సవ్' ముగింపు సభలో బాలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మూడు రోజుల పాటు జరిగిన విశాఖ ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి.
ఈ ఉత్సవాల్లో బాలయ్య సందడి చేశారు. తాను నటించిన కొత్త చిత్రం డిక్టేటర్ చిత్రంలోని పంచ్ డైలాగులతో విశాఖ వాసులను బాలయ్య అలరించారు. బాలయ్యను చూసేందుకు వచ్చినవారితో ఆర్కే బీచ్ జనసంద్రమైంది. బాలకృష్ణ చెప్పిన డిక్టేటర్ డైలాగులు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.

విశాఖ ఉత్సవ్: పంచ్ డైలాగులతో బాలయ్య సందడి (ఫోటోలు)
ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ విశాఖకు సాగరతీరం, అరకు వంటివి ప్రకృతి వరాలని వీటిని మరింతగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముందన్నారు.

విశాఖ ఉత్సవ్: పంచ్ డైలాగులతో బాలయ్య సందడి (ఫోటోలు)
ఎంతోమంది సాహితీకారులు, కళాకారులకు విశాఖ పుట్టినిల్లని, అలాంటి ఈ నగరంతో తనకెంతో అనుబంధముందని తెలిపారు.

విశాఖ ఉత్సవ్: పంచ్ డైలాగులతో బాలయ్య సందడి (ఫోటోలు)
హుద్‌హుద్ తుఫాను తర్వాత తొలిసారి నగరంలో సినిమా షూటింగ్ చేసింది తానేనని వివరించారు. విశాఖను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు.

విశాఖ ఉత్సవ్: పంచ్ డైలాగులతో బాలయ్య సందడి (ఫోటోలు)
కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ విశాఖలో ప్రతి వీకెండ్‌లోనూ వినోదాలు పంచేందుకు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేలా బీచ్‌రోడ్డులో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేయాలన్న సీఎం చంద్రబాబు ఆలోచనకు కార్యరూపం ఇస్తామన్నారు.

విశాఖ ఉత్సవ్: పంచ్ డైలాగులతో బాలయ్య సందడి (ఫోటోలు)
అదేవిధంగా గిరిజనుల అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. బాలయ్య చెప్పిన డైలాగులకు ఆర్కే బీచ్ అభిమానుల ఈలలు, చప్పట్లతో మార్మోగిపోయింది.

విశాఖ ఉత్సవ్: పంచ్ డైలాగులతో బాలయ్య సందడి (ఫోటోలు)
విశాఖ ఉత్సవ్‌లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు, శివారెడ్డి మిమిక్రీ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.

విశాఖ ఉత్సవ్: పంచ్ డైలాగులతో బాలయ్య సందడి (ఫోటోలు)
జనం తండోపతండాలుగా రావడంతో విశాఖలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. మొత్తానికి విశాఖ ఉత్సవ్ ముగింపు వేడుకలు బాణాసంచా వెలుగుజిలుగుల మధ్య, భారీ జనసందోహం మధ్య ఘనంగా ముగిశాయి.

Click it and Unblock the Notifications