ఆన్‌లైన్ సెక్స్ రాకెట్: సుందరాంగుల ఫొటోలు పెట్టి ఇలా ముగ్గులోకి లాగుతారు
విశాఖపట్నం: విశాఖపట్నంలో పోలీసులు ఆన్‌లైన్ వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాదుకు చెందిన వ్యక్తితో పాటు ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఆన్‌లైన్ సెక్స్ రాకెట్‌ను అతి తెలివితేటలతో నిర్వహిస్తున్నట్లు బయటపడింది.

విశాఖ కేంద్రంగా జరిగిన ఆ ఘటన సంచలనం రేపుతోంది. అందమైన యువతుల ఫోటోలను ఆన్‌లైన్‌లో పెడుతారు పెడతారు. ఫోటోను క్లిక్ చేయగానే ఫోన్ నంబర్ కూడా వస్తుంది. ఫోటోలో చూసిన అమ్మాయే మీకు ఫోన్ చేస్తోంది. మీకు కావాల్సిన ఇవ్వాలంటే వైజాగ్ రావాలని చెబుతుంది. వైజాగ్ వెళ్లడంతో వారు వ్యభిచారం ముఠా వలలో పడిపోతారు.
వ్యభిచార కార్యకలాపాల కోసం విశాఖలోని సీతమ్మపేట కేంద్రంగా కొంత మంది వెబ్‌సైట్ క్రియేట్ చేసి అలా ఆన్‌లైన్ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు. వెబ్‌సైట్లో అందమైన యువతుల ఫోటోలు పెట్టి, సోషల్ మీడియాలో విటులను ఆకర్షిస్తున్న ముఠా కార్యకలాపాలను పోలీసులు భగ్నం చేశారు.

అందమైన యువతులకు డబ్బుల ఎర వేసి, వ్యభిచార రొంపిలోకి దింపుతున్నట్లుగా పోలీసుల విచారణలో వెలుగుచూసింది. పక్కా సమాచారంతో ద్వారకాజోన్ పోలీసులు ఈ ముఠా గుట్టు విప్పారు. పోలీసులకు చిక్కిన ఆన్‌లైన్ ముఠా సభ్యులు నెల క్రితం హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. ఆన్‌లైన్‌లో అందమైన అమ్మాయిల ఫోటోలను పోస్ట్ చేసి ఫోన్ నంబర్లు ఇచ్చేవారి గురించి తమకు తెలపాలని పోలీసులు సూచించారు.












Click it and Unblock the Notifications