విశాఖలో వింత దొంగ: నగ్నంగానే ఇళ్లలోకి వెళ్లి చోరీలకు పాల్పడుతున్నాడు!

విశాఖపట్నం: నగరంలో అర్ధరాత్రి సమయంలో ఓ దొంగ ఒంటిపై నూలుపోగు లేకుండా మూడు ఇళ్లలో చోరీకి యత్నించాడు. ఒక ఇంట్లో నగదును దోచుకెళ్లాడు. ఇటీవల ఓ వ్యాపారి ఇంట్లో దొంగతనానికి వచ్చినప్పుడు ఈ తతంగం అంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. నగ్నంగా తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్న దొంగ సంగతి నగరంలో కలకలంగామారింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్రిపాలెం వుడాకాలనీ ప్రాంతం ఆదివారం అర్ధరాత్రి ఓ ఇ:ట్లోకి గుర్తుతెలియని వ్యక్తి వెనుక ద్వారం నుంచి లోపలికి ప్రవేశించాడు. బలంగా ఉన్న ఆ వ్యక్తి ఒంటిపై నూలు పోగు కూడా లేదు. అతడు ఇళ్లంతా తిరగడం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డైంది.

visakhapatnam: A naked thief entered in houses and thefting

ఆ ఇంట్లో ఉన్న బంగారం దొరకకపోవడంతో బీరువాలో దొరికిన రూ. 15వేలు తీసుకుని వెళ్లిపోయాడు. ఆ తర్వాత మళ్లీ ఆ దొంగ ఆ ప్రాంతంలోనే మరో ెండు ఇళ్లలో నగ్నంగానే చోరీ చేసేందుకు ప్రయత్నించాడు. అతనికి ఏమీ దొరక్కపోవడంతో తిరిగి వెళ్లిపోయాడు.

స్థానికులు ఎయిర్ పోర్టు జోన్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం వేలిముద్రలను సేకరించారు. అనుమానాస్పద వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

Recommended Video

    Vishakapatnam వచ్చినప్పుడు కలుస్తానమ్మా.. అభిమాని పై Pawan Kalyan ట్వీట్ || Oneindia Telugu

    స్థానికుల సమాచారం ప్రకారం.. వడ్డాది త్రినాథరావు అనే వ్యాపారి కుటుంబసభ్యులతో కలిసి మరో ఊరికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూలేని సమయం చూసి ఆ దొంగ వీరింట్లో చోరీకి పాల్పడ్డాడు. ఎవరూ పట్టుకోకుండానే తన ఒంటిపై నూలుపోగులేకుండా దొంగతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+