ట్రంప్ ప్రమాణ స్వీకారం.. విశాఖపట్నంలోని ఆ ఇంట్లో పండగ వాతావరణం

Donald Trump's swearing-in ceremony: డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఇంకొన్ని గంటలే మిగిలివుంది. ఆ దేశ కాలమానం ప్రకారం ఈ మధ్యాహ్నం 12 గంటలకు రాజధాని వాషింగ్టన్ డీసీలోని కేపిటల్ వన్ ఎరినా, రొటుండాలో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేస్తారు.

భారత్‌లో ఈ కార్యక్రమం ఈ రాత్రి 10:30 గంటలకు ప్రారంభమౌతుంది. ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రమాణ స్వీకారం అనంతరం అధ్యక్షుడి హోదాలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు డొనాల్డ్ ట్రంప్. వచ్చే నాలుగేళ్లల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై మాట్లాడతారు.

Visakhapatnam JD Vance s wife Usha Vance s grandaunt C Santhamma congratulated them

జేడీ వాన్స్ భార్య.. ఉషా చిలుకూరి వాన్స్. భారత సంతతికి చెందిన మహిళ. ఆమెకు తెలుగు కుటుంబానికి చెందినవారు. విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో ఇప్పటికీ ఆమెకు బంధువులు ఉన్నారు. విశాఖలో నివసిస్తోన్న ప్రొఫెసర్ సీ శాంతమ్మకు మనవరాలి వరుస అవుతారు.

శాంతమ్మ భర్త చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి తమ్ముడు రామశాస్త్రి కుమార్తెనే ఉషా చిలుకూరి. ఆమెకు కృష్ణాజిల్లా ఉయ్యూరులో బంధువులు ఉన్నారు. తాత చిలుకూరి రామ్మోహన్ రావు కుటుంబం ఉయ్యూరులో ఉంటోంది. చిలుకూరి రామశాస్త్రి చాలాకాలం పాటు చెన్నైలో నివసించారు. ఐఐటీ- చెన్నైలో చదువుకున్నారు. కొంతకాలం అక్కడే ప్రొఫెసర్‌గా పని చేశారు.

అనంతరం భార్య బాలాత్రిపుర సుందరితో కలిసి అమెరికా వెళ్లిపోయారు. రామశాస్త్రి- బాలా త్రిపురసుందరి దంపతులకు 1986 జనవరి 6వ తేదీన కాలిఫోర్నియా శాన్‌డియాగోలో ఉషా చిలుకూరి జన్మించారు. ఆమె చెల్లెలు శారద ఇప్పటికీ చెన్నైలో నివాసం ఉంటోన్నారు.

ఉషా చిలుకూరి వృత్తిరీత్యా అడ్వొకేట్. యేల్ యూనివర్శిటీ బ్యాచిలర్ డిగ్రీ, కేంబ్రిడ్జి యూనివర్శిటీలో ఎంఫిల్ పూర్తిచేశారు. గేట్స్ కేంబ్రిడ్జి స్కాలర్‌షిప్ కింద ఆమె ఎంఫిల్ చదివారు. 2014లో జేడీ వెన్స్‌ను పెళ్లాడారు. వారిది లవ్ మ్యారేజ్. రోమన్ క్యాథలిక్ అయిన జేడీ.. యేల్ యూనివర్శిటీలో చదువుకుంటోన్నప్పుడు ఆమెకు పరిచయం అయ్యారు. వారికి ఇవాన్, వివేక్, మిరాబెల్ అనే పిల్లలు ఉన్నారు.

నేడు ప్రమాణ స్వీకారం చేయబోతోన్న నేపథ్యంలో సీ శాంతమ్మ ఏఎన్ఐతో మాట్లాడారు. జేడీ వాన్స్, ఉషా చిలుకూరి వాన్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అత్యున్నత శిఖరాలకు చేరుకున్నారని ప్రశంసించారు. ట్రంప్- జేడీ వాన్స్ హయాంలో అమెరికా- భారత్ పురోగమించాలని ఆకాంక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+