Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Visakhapatnam Loksabha:విశాఖ పార్లమెంట్ బరిలో శ్రీభరత్ ఒంటరివాడా.. అందరివాడా..?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ఇటు అసెంబ్లీ అటు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములపై పెద్ద చర్చే జరుగుతోంది. ఈసారి ఎన్నికలు ఇటు అధికారిక వైసీపీకి అటు ప్రతిపక్ష కూటమికి చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో అయితే రెండు పార్టీలు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

దీంతో ఆయా నియోజకవర్గాల్లో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. అలాంటి నియోజకవర్గాల్లో ఒకటే విశాఖ పార్లమెంట్. విశాఖ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ ప్రధాన పోటీ వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ కూటమి బలపరచిన టీడీపీ అభ్యర్థి భరత్‌ మధ్యే ఉంది. అయితే ఎవరికి ఇక్కడ అడ్వాంటేజ్‌గా ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Visakhapatnam Loksabha NDA candidate TDP leader Sri Bharth lacks support from cadre here is why

విశాఖ పార్లమెంట్ కూటమి అభ్యర్థి శ్రీభరత్

విశాఖ పార్లమెంటులో టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా భరత్ పోటీ చేస్తున్నారు. 2019లో ఇదే విశాఖ నుంచి పోటీ చేసిన భరత్ ఓటమిపాలయ్యారు. ఈ సారి కచ్చితంగా గెలవాలనే కసితో ముందుకు అడుగులు వేస్తున్నాడు.కానీ విశాఖలో పరిస్థితి వేరుగా ఉంది.

అక్కడున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమిలోనే అంతర్గత కుమ్ములాటలు భరత్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి.దీంతో భరత్‌ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనే కన్ష్యూజన్‌లో ఉన్నట్లు అతని సన్నిహితులే చెబుతున్నారు. కొన్ని చోట్ల అయితే స్థానిక నాయకులే భరత్‌కు అండగా నిలిచే పరిస్థితి కనిపించడం లేదు.

Visakhapatnam Loksabha NDA candidate TDP leader Sri Bharth lacks support from cadre here is why

భరత్‌కు కూటమి నుమచి మద్దతు కరువు

ఇక భరత్‌తో పాటు రోజూ తిరుగుతున్న నాయకులు కూడా ఒక్కింత అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. రోజూ భరత్‌తో తిరుగుతున్నప్పటికీ అతను మరుసటి రోజు వారిని గుర్తు పట్టడం లేదట. చాలా కొత్తగా చూస్తున్నారని వాపోతున్నారు. దీంతో అలాంటి వ్యక్తి వెంట ఎందుకు నడవాలని ప్రశ్నిస్తున్నారు. ఇక సీనియర్ నాయకులు అనుభవంతో ఇస్తున్న సలహాలను భరత్ పాజిటివ్‌గా తీసుకోవడం లేదనే టాక్ కూడా విశాఖ పార్లమెంట్ పరిధిలో వినిపిస్తోంది.

తన చుట్టూ ఎప్పుడూ కనిపించే ఓ నలుగురు మాత్రమే ఉంటారని, అందునా, తన సామాజిక వర్గంకు చెందిన వారికే భరత్ పెద్ద పీట వేస్తున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రచారంలో భాగంగా తన చుట్టూ ఆ సామాజికవర్గం వారు ఉన్నారా లేదా అనేదే శ్రీభరత్ చూసుకుంటున్నారని , సీనియర్లను పక్కన పెట్టేశారని కొందరు నాయకులు వాపోతున్నారు. దీంతో ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా భరత్ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

Visakhapatnam Loksabha NDA candidate TDP leader Sri Bharth lacks support from cadre here is why

అంతర్గత కుమ్ములాటలతో భరత్‌కు నష్టం

భీమిలి నుంచి పోటీ చేస్తున్న గంటా శ్రీనివాసరావు లాంటి సీనియర్లను కలుపుకుని వెళ్లడం లేదని అంటున్నారు. ప్రస్తుతం ఎస్. కోటలో తెలుగుదేశం అభ్యర్థి లలితకుమారికి,ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ కి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందట.అలాగే విశాఖ వెస్ట్ అభ్యర్థి పీజీవీఆర్ నాయుడుతో కూడా చెడిందని చెప్తున్నారు. ఇలా మరో రెండు నియోజకవర్గాల్లో కూడా ఇతనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

అతని కారణంగా నియోజకవర్గాల్లో పార్టీపై ఎఫెక్టు పడుతుందనే భావనతో కొందరు పార్టీ అభ్యర్థులు శ్రీ భరత్ ని దగ్గరకు రానివ్వడం లేదని అంటున్నారు.విశాఖ సీటు కోసం బీజేపీ నేత జీవీఎల్ విశ్వప్రయత్నాలు చేశారు. అయితే పొత్తులో భాగంగా ఆ సీటును శ్రీభరత్‌కు కేటాయించడంతో అక్కడ బీజేపీ క్యాడర్ మద్దతు ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. వాస్తవానికి విశాఖలో బీజేపీకి మంచి బలమే ఉందని చెప్పాలి.

Visakhapatnam Loksabha NDA candidate TDP leader Sri Bharth lacks support from cadre here is why

సైడ్ అయిపోయిన జనసేన క్యాడర్

ఇక జనసేన నేతలు కూడా శ్రీ భరత్ తో కలిసి వెళ్లడం లేదు. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం నేతలకే ప్రాధాన్యం ఉండటంతో, రేపు మనల్ని గీతం కాలేజీ కాంపౌండ్ గేటు లోపలికి కూడా రానివ్వడని బలంగా నమ్ముతున్నారు. దాంతో వాళ్లు కూడా నెమ్మదిగా సైడ్ అయిపోయారు.ఇక పార్టీలో చాలామంది కార్యకర్తలు, సీనియర్ నేతల మాటేమిటంటే, పార్టీకి కొన్ని సంవత్సరాలుగా ఎంతో నమ్మకంతో సేవలు చేశామని కానీ శ్రీ భరత్ మమ్మల్ని అనుమానిస్తున్నాడని చెవులు కొరుక్కుంటున్నారు.ఇలాంటి వాడితో కలిసి నడవలేమని చెప్పి, ఎవరికి వారు ఇళ్ల నుంచి బయటకు కూడా రాని పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయాలు వదిలేసి సొంత పనుల్లో పడ్డారనే టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది.రోజుకింతని డబ్బులు తీసుకునే బ్యాచ్ లే ఆయన వెంట నడుస్తున్నాయని నిజమైన క్యాడర్ ఆరోపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+