వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గరికపాటి నరసింహారావును అరెస్ట్ చేయాలి?

|
Google Oneindia TeluguNews

వ్యక్తిత్వ వికాసాన్ని ఆధ్యాత్మికతతో ముడిపెట్టి స్ఫూర్తి కలిగించేలా ఆయన ప్రవచనాలుంటాయి. ప్రస్తుత సమాజంలో మనిషి ఏ విధంగా నడవాలి? మర్యాద, ప్రేమ తదితర విషయాలపై ఆయన చెప్పే ప్రవచనాలు కచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. ఆయనే ప్రముఖ ఆధ్మాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు. అయితే ఆయన్నుఅరెస్ట్ చేయాలంటూ విశాఖపట్నంలో మహిళా సంఘం నాయకులు ధర్నా చేశారు.

విశాఖ నగరంలోని జివిఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళా సంఘాల ఆధ్వర్యంలో గరికపాటికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. గరికపాటి తన ప్రవచనాల్లో ప్రతిసారీ మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మికత అనే ముసుగులో మహిళా సాధికారతను అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం, పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.

visakhapatnam womens fired on garikapati narasimha rao

హిందూ ధర్మ ప్రవచనాల పేరుతో గరికపాటి మహిళలను అవమానిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకునేవరకు తమ పోరాటం ఆగేది లేదని స్పష్టం చేశారు. గరికపాటిపై చర్య లు తీసుకోకుంటే తమ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తమ పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. లక్ష్మి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.

దసరా తర్వాతరోజు హైదరాబాద్ లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమం సందర్భంగా చిరంజీవినుద్దేశించి చేసిన వ్యాఖ్యలు రగడ సృష్టించాయి. దీనిపై చిరంజీవి అభిమానులు, అఖిల భారత బ్రాహ్మణ సంఘం నాయకుల మధ్య కొద్దిరోజులు సోషల్ మీడియాలో యుద్ధం నడిచింది.

English summary
His prophecies are inspiring by linking personality development with spirituality.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X