మెడలో దిగేదని జగన్ చెప్పారు: కీలక అంశాలు చెప్పిన సీపీ, 'జగన్‌ను చంపాలనే, 3 బ్యాంక్ అకౌంట్లు'

విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసిన నిందితుడు శ్రీనివాస రావు ఈ ఏడాది జనవరి నెలలోనే కత్తి తీసుకువచ్చి వంటగదిలో భద్రపరిచాడని విశాఖ పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా చెప్పారు. ఈ కేసు గురించి ఎన్నో విషయాలను ఆయన వెల్లడించారు.

Recommended Video

    YSRCP Press Meet : చంద్రబాబుకు చట్టాలు, రాజ్యాంగం పై గౌరవం లేదు !

    ఈ కేసుపై మూడు రోజుల పాటు పలు కోణాల్లో దర్యాఫ్తు చేశామని తెలిపారు. నిందితుడి నుంచి నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, అతను ఓ ట్యాబ్ వాడాడని, దానిని తీసుకుంటామని చెప్పారు. అతను తన సోదరుడు చైతన్యతో ప్లెక్సీని తయారు చేయించాడని వెల్లడించారు. పి.గన్నవరం లేపాక్షి ప్లెక్సీ దుకాణంలో దీనిని ఆర్డర్ ఇచ్చారని చెప్పారు.

    జగన్‌కు అర సెంటీమీటరు లోతన గాయం

    జగన్‌కు అర సెంటీమీటరు లోతన గాయం

    ఫ్లెక్సీకి రూ.1800 వందలు చెల్లించారని సీపీ తెలిపారు. అలాగే ప్రేమ్ చేసిన వారికి రూ.500 ఇచ్చాడని చెప్పారు. విశాఖపట్నం డాక్టర్ చెప్పిన సమాచారం మేరకు జగన్‌కు అర సెంటీ మీటరు లోతున గాయం అయిందని చెప్పారు. హైదరాబాదులో డాక్టర్లు కూడా ఇదే విషయం చెప్పారని అన్నారు. హైదరాబాదులో డెబ్రిడ్‌మెంట్ చేశారని తెలిపారు.

    రాత బాగున్నప్పుడు వేరేవాళ్లతో ఎందుకు రాయించాడో

    రాత బాగున్నప్పుడు వేరేవాళ్లతో ఎందుకు రాయించాడో

    నిందితుడు శ్రీనివాస రావు నుంచి స్వాధీనం చేసుకున్న 11 పేజీల లేఖలో సహ ఉద్యోగిణి విజయ 9 పేజీలు రాసందని, రేవతి అనే మరో మహిళ ఓ పేజీ రాసిందని, అతని రాత బాగున్నప్పుడు మరొకరితో ఎందుకు రాయించాడో విచారిస్తున్నామని చెప్పారు. శ్రీనివాస రావు మొత్తం 9 ఫోన్లు ఉపయోగించాడని చెప్పారు. జగన్‌కు వినతిపత్రం ఇస్తానని వచ్చాడని, మరో రెండు రోజుల్లో మరిన్ని విషయాలు వెలుగు చూడవచ్చునని చెప్పారు.

    పక్కకు జరగకుంటే మెడలో దిగేదని జగన్ చెప్పారు

    పక్కకు జరగకుంటే మెడలో దిగేదని జగన్ చెప్పారు

    వైయస్ జగన్ తొలుత తమకు స్టేట్‌మెంట్ ఇవ్వలేదని సీపీ తెలిపారు. అనంతరం తమ అధికారులతో మాట్లాడుతూ దాడి చేసిన సమయంలో పక్కకు జరగడంతో కత్తి భుజంలో దిగిందని, లేదంటే మెడలో దిగేదని జగన్ చెప్పారని, అదే విషయం తాము నమోదు చేసుకున్నామని చెప్పారు. జగన్ పక్కన ఉన్న వారు వాంగ్మూలం ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని, దీంతో అక్కడ ఏం జరిగిందో తెలియకుండా ఉందన్నారు.

    నిందితుడి పేరుపై 3 బ్యాంక్ అకౌంట్లు

    నిందితుడి పేరుపై 3 బ్యాంక్ అకౌంట్లు

    తొమ్మిది పది నెలల క్రితం అంటే ఈ ఏడాది జనవరిలోనే కోడి పందెల వద్దకు వెళ్లినప్పుడు కత్తి దొరికిందని, దానిని తెచ్చి వంటింట్లో పెట్టాడని, అది జగన్ కోసం తీసుకొచ్చాడా మరేదైనా కారణం ఉందా తెలియాల్సి ఉందని చెప్పారు. నిందితుడికి మూడు బ్యాంక్ ఖాతాలు ఉన్నట్లు గుర్తించామని, విజయా బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, ఎస్బీఐలో ఖాతాలు ఉన్నాయని చెప్పారు. గత ఏడాది కాలంలో శ్రీనివాస రావు వేలాది ఫోన్ కాల్స్ మాట్లాడారని చెప్పారు.

    జగన్‌ను చంపాలనే, రెండు కత్తులు

    జగన్‌ను చంపాలనే, రెండు కత్తులు

    జగన్‌ను చంపాలనే నిందితుడు శ్రీనివాసరావు కోడి పందేల కత్తితో దాడి చేశాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో ఉందని తెలుస్తోంది. జగన్‌కు ప్రాణహాని చేయాలన్న ఉద్దేశంతోనే ఈ దాడి జరిగిందని పేర్కొన్నారని సమాచారం. అయితే దాడి సమయంలో జగన్ అప్రమత్తంగా ఉండటంతో దాడి నుంచి తప్పించుకున్నారని పేర్కొన్నారు. జగన్ మెడపై దాడి చేయాలని నిందితుడు అనుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు చెప్పారని తెలుస్తోంది. ఈ దాడి కోసం నిందితుడు రెండు కత్తులను తెచ్చుకున్నాడనీ, మొదటి పోటు తప్పిపోయినా మరో కత్తితో దాడి చేసేందుకు ప్రణాళిక రచించాడని పేర్కొన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+