Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణ సిఎం కెసిఆర్ గన్‌మెన్‌కు విశాఖ పోలీసుల నోటీసులు

విశాఖ: ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ వ్యాపారి అపహరణ కేసులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యక్తిగత గన్‌మెన్ మధుసూదన్ రెడ్డి, మరో వ్యక్తి సతీష్ రెడ్డిలకు విశాఖపట్నం జిల్లా పెందుర్తి పోలీసులు బుధవారం నోటీసులు జారీ చేశారు.

నోటీసులు అందిన మూడు రోజుల్లోగా విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలను జారీ చేశారు. 2013లో ఒడిశాకు చెందిన ఓ వ్యాపారిని అపహరించి వాహనంలో తీసుకెళ్తుండగా పెందుర్తి పోలీసులు మాటువేసి నిందితులను పట్టుకున్నారు.

కొంతమంది నిందితులు పరారయ్యారు. కేసు దర్యాఫ్తు క్రమంలో పరారైన నిందితులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గన్‌మెన్ మధూసూదన రెడ్డి, సతీష్ రెడ్డిలను గుర్తించారు. ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేసినట్లు సిఐ తెలిపారు.

Vishaka police notices to Telangana CM KCR's gunmen

టెక్కీ ఆత్మహత్య

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాఫ్టువేర్ ఇంజినీర్ తన ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్-3లో ఉమారాణి అనే మహిళ ఉస్మానియా ఆసుపత్రిలో ఉద్యోగిని. ఆమె కూతురు సంధ్య హైటెక్ సిటీలోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా పని చేస్తున్నారు.

తల్లి రోజూ మాదిరిగా ఉదయం ఆసుపత్రికి వెళ్లి సాయంత్రం వచ్చేసరికి సంధ్య తన బెడ్ రూంలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెంది ఉంది. సూసైడ్ నోట్ రాసి పెట్టింది. కొంతకాలంగా గుండె నొప్పితో బాధపడుతున్నానని, తండ్రి మరణం తర్వాత మానసికంగా ఒత్తిడిలో ఉన్నానని పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+