టిడిపి వచ్చాక 2400 కోట్ల స్కాం, మంత్రులూ.., చంపేస్తానని బెదిరింపు: విష్ణు షాకింగ్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు మంగళవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చాక విశాఖలో భూదందా పెరిగిపోయిందని, రూ.2,400 కోట్ల స్కాం అని తీవ్ర ఆరోపణలు చేశారు.

స్కాం ప్రశ్నించినందుకు..

స్కాం ప్రశ్నించినందుకు..

ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. విశాఖలో జరుగుతున్న భూదందాపై విచారణ జరగాలన్నారు. ఈ స్కాం గురించి ప్రశ్నిస్తే తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించారు.

చంపుతామని బెదిరింపులు

చంపుతామని బెదిరింపులు

విశాఖలో బీజేపీకి సీట్లు రాకుండా చేస్తానని, మిమ్మల్ని ఓడిస్తామని, స్కాం గురించి మాట్లాడితే నీకు ఇదే చివరి అసెంబ్లీ అని బెదిరింపులు వచ్చాయని విష్ణు కుమార్ అన్నారు. తనకు స్కాం విషయంలోనే చంపేస్తామని బెదిరింపులు వచ్చాయన్నారు.

స్కాంలో కేబినెట్ మంత్రులు.. టిడిపికి వచ్చాకే

స్కాంలో కేబినెట్ మంత్రులు.. టిడిపికి వచ్చాకే

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాకనే విశాఖలో అక్రమాలు పెరిగాయన్నారు. వుడా అధికారుల్ని మోసం చేస్తూ ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారన్నారు. ఈ భూదందాల్లో కేబినెట్ మంత్రులు కూడా ఉన్నట్లు ఆరోపణలు, అనుమానాలు ఉన్నాయన్నారు.

రూ.2400 కోట్ల కుంభకోణం

రూ.2400 కోట్ల కుంభకోణం

ఈ స్కాం చిన్నదే కాదని, రూ.2,400 కోట్ల కుంభకోణమని ఆరోపించారు. బడా రాజకీయ నేతలు భూదందాలకు పాల్పడ్డారని చెప్పారు. భూదందా గురించి అడిగితే చంపేస్తానని బెదిరింపులు రావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనిత ఖండన

అనిత ఖండన

విష్ణు కుమార్ రాజు ఆరోపణలపై టిడిపి ఎమ్మెల్యే వంగలపూడి అనిత స్పందించారు. విశాఖలో అక్రమాలపై విచారణ జరుగుతోందని చెప్పారు. పెందుర్తిలో ఇందుకు సంబంధించి కేసు నమోదయిందన్నారు. విష్ణు ఆరోపణలపై ప్రభుత్వం ఏ కమిటీ వేయాలో నిర్ణయిస్తుందని చెప్పారు. ఈ స్కాంలో మంత్రులు ఉన్నారని విష్ణు చెబుతున్నారని, ఆ మంత్రులు ఎవరో, వారి పేర్లు బయటకు చెప్పాలన్నారు. అప్పుడు చర్యలు తీసుకోకుంటే తమను అడగాలన్నారు. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్ గురించి అనిత మాట్లాడుతూ... లీకుల గురించి మాట్లాడే అర్హత వైసిపికి లేదన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP leader Vishnu Kumar Raju on Tuesday dragged Cabinet Ministers into Vishaka land scam. He make shocking comments on Telugudesam government.
Please Wait while comments are loading...