అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతి నిర్మాణం ఎంతవరకూ వచ్చిందంటే ?

|
Google Oneindia TeluguNews

Recommended Video

అమరావతి నిర్మాణం ఎంతవరకూ వచ్చిందంటే ?

అమరావతి డిజైన్లను ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఫైనల్ చేసింది. అయితే ఈ డిజైన్ల ఎంపిక కోసం సినీ దర్శకుడు రాజమౌళి సహకారం కూడ తీసుకొన్నారు. అమరావతి లో అసెంబ్లీ భవనానికి టవర్ ఆకృతిని ఫైనల్ చేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే CRDA తాజాగా అమరావతి నిర్మాణం పనులకు సంబందించిన వీడియో ఒకటి విడుదల చేసారు. ఏ పని ఎంతవరకూ వచ్చిందనే విషయం తెలియచేస్తూ అన్ని డిజైన్ల కూ పనులకూ సంబందించిన విజువల్స్ చూపిస్తూ ఆ వీడియో ఉంది.

విశేష మద్దతు పొందిన టవర్‌ డిజైన్‌లో అసెంబ్లీ భవంతి 750 చదరపు అడుగుల వెడల్పు కలిగి ఉండాలని ప్రతిపాదించారు. సుమారు 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది.చుట్టూ ఉన్న తటాకంలో దీని ప్రతిబింబం కనపడుతుంది. ఈ టవర్‌లో 70 మీటర్ల ఎత్తు వరకు సందర్శకులు వెళ్లవచ్చు.

కాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో అడుగడుగునా ప్రజాభిప్రాయానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాజధాని భవన నిర్మాణ ఆకృతులపై ప్రజల మాట తెలుసుకోవాలని నిర్ణయించింది. భవన సముదాయ డిజైన్ల విషయంలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో డిజైన్లను సోషల్ మీడియాలో ఉంచారు. ఇక చంద్ర బాబు ఆలోచనా విదానానికి చాలామంది అబినందిస్తున్నారు కూడా. అలాగే కొండవీటి వాగు వల్ల ఇప్పటివరకు వరద ముప్పుతో ఇబ్బందులు పడ్డారు.. ఇక ముందు రాజధాని ప్రాంతంలో వరద ముప్పు వల్ల ప్రజలకు ఇబ్బంది వుండదు. కొండవీటి వాగుతో లాభాలను చూస్తారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇప్పటికే తెలిపారు. గత వంద సంవత్సరాల నుంచి కొండవీటి వాగు ముంపు వల్ల అనేక వేల ఎకరాలలో పంటనష్టం జరిగింది.

అమరావతి సీడ్ యాక్సెస్‌ రోడ్డుని విస్తరించి అభివృద్ధి చేసే పనిలో అధికారులు ఉన్నారు. కాగా సీడ్ యాక్సెస్‌ రోడ్డుని అమరావతి నుండి విజయవాడకు కలిపే ప్రాసెస్ లో కొన్ని అడ్డంకులు ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. అలాగే అమరావతి తాత్కాలిక అసెంబ్లీ వెలగపూడిలో నిర్మించిన సంగతి తెలిసిందే. సెక్రటేరియట్ ని కూడా వీడియోలో చూపించారు. నేలపాడు లోని VIT యునివెర్సిటీ, నీరుకొండలోని SRM యునివెర్సిటీ అబివృద్ది పనులు వేగంగా జరుగుతున్నాయి. అన్ని వెరసి ఒక రెండు సంవస్థరాల లో అమరావతి నిర్మాణం జరగవచ్చు అని అందరు అభిప్రాయపడుతున్నారు.

English summary
Visuals from a video made by the Andhra Pradesh Capital Region Development Authority shows the progress made on the Kondaveeti Vaagu Lift Work project, Seed Access Road, Arterial Road N9, Arterial Road E10, the construction of the Secretariat and Assembly in Velagapudi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X