తొలి వికెట్ డౌన్: విశ్వరూప్ రాజీనామా ఆమోదం

తన రాజీనామాను ఆమోదించడాన్ని విశ్వరూప్ స్వాగతించారు. తాను సమైక్యాంధ్ర కోసం కార్యకర్తగా పనిచేస్తానని ఆయన చెప్పారు. కాంగ్రెసు అధిష్టానం నిర్ణయాన్ని అమలు చేయడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహకరిస్తున్నారని ఆయన అన్నారు. తమను బుజ్జగించి అధిష్టానం నిర్ణయాన్ని ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని ఆయన అన్నారు.
తెలంగాణ ప్యాకేజీకి ముఖ్యమంత్రి అప్పుడే అంగీకరించి ఉంటే విభజన జరిగేది కాదని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్రకు అనుకూలంగా ప్రకటనలు చేస్తూ విభజనకు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. గతంలోనే తాను కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు.
విశ్వరూప్ త్వరలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ప్రచారం ఉంది. దానిపై ప్రశ్నించినప్పుడు - తాను వైయస్ రాజశేఖర రెడ్డికి విధేయుడిని కాబట్టి అలాంటి ప్రచారం సాగుతోందని, ప్రస్తుతానికి తాను ఏ పార్టీలో చేరబోనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications