పరిటాల హత్య కుట్ర: కోడెల, వివేక్ ఒబెరాయ్ గ్రామం దత్తత(పిక్చర్స్)

అనంతపురం: మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్య ఆనాటి ప్రభుత్వం కుట్రతోనే జరిగిందని ఏపీ శాసన సభ సభాపతి కోడెల శివప్రసాద రావు శనివార ఆరోపించారు. అనంతపురం జిల్లా వెంకటాపురంలో పరిటాల రవి 10వ వర్దంతి కార్యక్రమంలో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడారు.

నాటి ప్రభుత్వ కుట్రలకు రవి బలయ్యారన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక అధికారాన్ని అడ్డు పెట్టుకొని హత్య చేయించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కోడెల, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, మంత్రి పరిటాల సునీత, ప్రముఖ కవి, గాయకులు గోరటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

వివేక్ ఒబెరాయ్ మాట్లాడుతూ... కరువు జిల్లా అనంతను అభివృద్ధి పరచాలని రవీంద్ర తపన పడ్డారన్నారు. ఆయన ఆశయాలకు అందరు కృషి చేయాలన్నారు. సునీత మాట్లాడుతూ.. కరువు చిల్లాను అభివృద్ధి చేయాలనుకున్నారని చెప్పారు.

వివేక్ ఒబెరాయ్

వివేక్ ఒబెరాయ్

పరిటాల పదవ వర్ధంతి కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ హెలికాప్టర్‌లో వస్తున్న దృశ్యం. వారికి సునీత తదితరులు స్వాగతం పలికారు.

వివేక్ ఒబెరాయ్

వివేక్ ఒబెరాయ్

పరిటాల పదవ వర్ధంతి కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ హెలికాప్టర్‌లో వస్తున్న దృశ్యం. వారికి సునీత తదితరులు స్వాగతం పలికారు.

వివేక్ ఒబెరాయ్

వివేక్ ఒబెరాయ్

సినీ హీరో వివేక్‌ ఒబెరాయ్‌ మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితం అనంతకు మొదటిసారి వచ్చినప్పుడు జిల్లా ప్రజలు ఎంతో ఆప్యాయత చూపారని, ఇప్పుడు రెండింతల అభిమానాన్ని చూశానన్నారు. రవీంద్ర ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలన్నారు.

వివేక్ ఒబెరాయ్

వివేక్ ఒబెరాయ్

పరిటాల రవీంద్ర జ్ఞాపకార్థం ఆయన నియోజకవర్గంలోని కనగానపల్లి మండలం ముత్తవకుంట్ల గ్రామాన్ని సినీ హీరో, రక్తచరిత్ర సినిమాలో పరిటాల పాత్ర పోషించిన బాలివుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ దత్తత తీసుకున్నారు.

పరిటాల వర్ధంతి

పరిటాల వర్ధంతి

టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్య ఆనాటి ప్రభుత్వ కుట్రతోనే జరిగిందని శాసనసభ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాద రావు ఆరోపించారు.

పరిటాల వర్ధంతి

పరిటాల వర్ధంతి

రవీంద్ర చనిపోయి పదేళ్లయినా ఇంతటి ప్రజాభిమానం చూస్తుంటే ఓవైపు బాధ.. మరోవైపు ఆనందం.. కలుగుతోందన్నారు. పరిటాల రవీంద్ర వ్యక్తి కాదు.. శక్తి అని అన్నారు. ఆనాటి ప్రభుత్వ కట్రకు రవి బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

పరిటాల వర్ధంతి

పరిటాల వర్ధంతి

రాజకీయంగా ఎదుర్కోలేక అధికారాన్ని అడ్డుపెట్టుకొని హత్య చేయించారని ఆరోపించారు. పరిటాల కుటుంబం చేస్తున్న సేవా కార్యక్రమాలు, ప్రజాభివృద్ధి వల్లే ఇంతటి అభిమానం చూపుతున్నారన్నారు.

పరిటాల వర్ధంతి

పరిటాల వర్ధంతి

2004లో ప్రభుత్వం మారగానే తనకు హాని జరుగుతుందని రవీంద్ర ఆందోళన వ్యక్తం చేశారని, తనకు ప్రాణ రక్షణ కల్పించాలని అసెంబ్లీలోనూ వేడుకున్నారని గుర్తు చేసుకున్నారు. కోర్టును కూడా ఆశ్రయించారన్నారు.

పరిటాల వర్ధంతి

పరిటాల వర్ధంతి

చంద్రబాబు ఇదే విషయాన్ని అసెంబ్లీలో ప్రముఖంగా ప్రస్తావించారని తెలిపారు. ఓ పథకం ప్రకారం.. అన్ని రకాల ఉచ్చులు బిగించి ప్రత్యర్థులతో ఆనాటి ప్రభుత్వ పెద్దలు హత్య చేయించారన్నారు. రవీంద్రను చంపిన దుర్మార్గులకు ఇప్పటికే కొందరికి కోర్టులో శిక్షపడగా, మరికొందరికి దేవుడే శిక్ష వేశాడన్నారు.

వివేక్ ఒబెరాయ్

వివేక్ ఒబెరాయ్

తాను కూడా జిల్లా వాసిగా ఉండాలనే కోరికతో ముత్తవకుంట్లను దత్తత తీసుకున్నానని, గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానన్నారు.

వివేక్ ఒబెరాయ్

వివేక్ ఒబెరాయ్

ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల స్పూర్తితో ముత్తంకుంట్లను స్మార్ట్‌విలేజ్‌గా తీర్చిదిద్దుతానని ప్రకటించారు.

వివేక్ ఒబెరాయ్

వివేక్ ఒబెరాయ్

తాను కూడా జిల్లా వాసిగా ఉండాలనే కోరికతో ముత్తవకుంట్లను దత్తత తీసుకున్నానని, గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని వివేక్ ఒబెరాయ్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+