ఎంపీ అవినాష్ సీబీఐ విచారణ- అరెస్ట్ అంశంపై హైకోర్టు కీలక తీర్పు..!!
సీబీఐ విచారణపై అవినాష్ రెడ్డి పీటీషన్ పై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
కడప ఎంపీ అవిశాష్ రెడ్డి పిటీష్ ను తెలంగాణ హైకోర్టు తోసి పుచ్చింది. వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ విచారణ కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే అవినాష్ రెడ్డి సీబీఐ ముందు విచారణకు హాజరయ్యారు. అదే సమయంలో హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. విచారణను ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని రిట్ పిటిషన్ లో కోరారు. లాయర్ సమక్షంలోనే జరగాలని పిటీషన్ లో కోరారు. ఈ పిటీషన్ విచారణ సమయంలో తుది తీర్పు వచ్చే వరకూ అవినాష్ పైన చర్యలు తీసుకోవద్దని సీబీఐని కోర్టు ఆదేశించింది. తీర్పు రిజర్వ్ చేసింది. ఈ రోజు తీర్పు వెలువరించిన హైకోర్టు అవినాష్ మధ్యంతర పిటీషన్లను తోసి పుచ్చింది. సీబీఐ విచారించుకోవచ్చన స్పష్టం చేసింది. అదే సమయంలో అరెస్ట్ చేయవద్దని ఆదేశించలేమని పేర్కొంది.
దీంతో..ఇప్పుడు సీబీఐ మరోసారి అనివాష్ ను విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోంది. అవినాష్ విచారణకు సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు సీబీఐ విచారణ సందర్భంగా అందించింది. 10 డాక్యుమెంట్లు, 35 మంది సాక్షుల వాంగ్మూలాలు, కొన్ని ఫొటోలను కోర్టుకు సమర్పించింది. అవినాష్ విచారణను ఆడియో, వీడియో ద్వారా రికార్డు చేస్తున్నట్లు కోర్టు దృష్టికి సీబీఐ తీసుకొచ్చింది. హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన లెటర్, ఎఫ్‌ఎస్ఎల్ నివేదికను కూడా హైకోర్టుకు సీబీఐ అందజేసింది. వీటిని కోర్టు తిరిగి సీబీఐకి తిరిగి ఇచ్చింది. ఈ కేసులో తన వాదనలు వినాలని వివేకా కుమార్తె సునీత ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేఏశారు. అయితే సునీత పిటిషన్ వెనుక సీబీఐ హస్తం ఉందని అవినాష్ రెడ్డి న్యాయవాది వాదించారు. సునిత అభియోగాల వెనకాల రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్నారు.

వివేక హత్య అనంతరం అనుకూలంగా ఉన్న సునీత ఏడాది తరువాత ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, వివేకా రెండో భార్య షమీంల పాత్రపై సీబీఐ విచారణ చేయడం లేదని తెలిపారు. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని దర్యాప్తు జరగాలని అవినాష్ తరుపు న్యాయవాది కోరారు. మరో వైపు వైఎస్ భాస్కర రెడ్డిని గత ఆదివారం విచారించాల్సిన సీబీఐ అందుకు నోటీసులు ఇచ్చింది. భాస్కర రెడ్డి విచారణ కోసం హాజరైనా అధికారులు అందుబాటులో లేకపోవటంతో విచారణ వాయిదా పడింది. మరో సారి నోటీసులు ఇస్తామని అధికారులు వెల్లడించారు, ఇప్పుడు అవినాష్ పిటీషన్ పైన హైకోర్టు తీర్పు రావటంతో తదుపరి పరిణామాల పైన ఉత్కంఠ మొదలైంది.












Click it and Unblock the Notifications